Saturday, May 18, 2024
- Advertisement -

హైకోర్టు తీర్పంటె లెక్క‌లేదా… అధికారుల‌కు..?

- Advertisement -
Alla Ramakrishna Reddy Fire on Authorities Over Land Acquisition

అధికారంలో ఉంటె ఏంచేసినా చెల్లుతుంద‌నే భావ‌న సాధార‌నంగా ఉంటుంది.అది టీడీపీకి మ‌రీ ఎక్క‌వ‌య్యింది.వారి అండ‌తో అధికార‌లుకూడు ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.చ‌ట్టాన్ని అతిక్ర‌మించే హ‌క్కు ఎవ‌రికీ లేదు.

ఒక సారి కోర్టు తీర్పు ఇస్తే దానికి క‌ట్టుబ‌డి ఉండాల్సిందే.కాని ఏపీలో మాత్రం అలా జ‌ర‌గ‌డంలేదు.చ‌ట్టం మాచుట్టం అన్న‌ట్లు అధికార‌పార్టీనాయ‌కులు,అధికార‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

{loadmodule mod_custom,GA1}

తాడేపల్లి మండలం పెనుమాకలో భూములివ్వ‌ని రైత‌ల‌నుంచి పిర్యాదుల‌ను తీసుకోవ‌డానికి అధికార‌లు అక్క‌డ‌కు వ‌చ్చారు.వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు మాత్రం సిద్ధపడలేదట. అభ్యంతరాలు నమోదు చేసుకోవద్దని మౌఖికంగా ఆదేశాలివ్వడంతో రాసుకోనూలేదు. హైకోర్టు ఆదేశం ప్రకారం వచ్చిన మీరు ఇలా చేస్తే చట్టాన్ని ఉల్లంఘించడం కాదా అని రైతుల తరపున వచ్చిన న్యాయవాదులు ప్ర‌శ్నించారు.
భూములివ్వకపోతే నష్టపోతారని బెదిరించడం వల్ల ్ల మీరు శిక్షను అనుభవించాల్సివస్తుందని న్యాయవాదులు ఆయనను హెచ్చరించారట. ఏమైనా సరే వ్యతిరేకులైన రైతుల అభిప్రాయాలు నమోదు చేయడానికి అధికారులు తిరస్కరించడంతో అక్కడ ఉద్రిక్తత పెరిగింది.స్థానిక ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి కుర్చీలు ఎత్తి పారేయడంతో తనపై కేసు పెట్టారు. ఆయనే సభ జరగకుండా అడ్డుకున్నారని కేసు న‌మోదు చేశారు పోలీసులు.

{loadmodule mod_custom,GA2}

ఆయన మీద కేసు పెట్టొచ్చు గాని రైతులు, లాయర్ల మాటేమిటి? న్యాయమైన అభ్యంతరాలు చట్టబద్దమైన హక్కులను ఉపయోగించుకోవడం కూడా అడ్డుపడ్డం అంటే ఎలా? రైతుల భూముల‌ను తీసుకొనేట‌ప్పుడు వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాల‌ని హైకోర్టు తీర్పు చెప్పిన‌పుడు అధికారుల‌కు ఎందుకంత ఇబ్బందో.అంటె కోర్టుతీర్పులంటే లెక్క‌లేదా..? మ‌రి అధికారులే ప్ర‌జాస్వామ్యానికి తిలోద‌కాలు ఇచ్చిన‌పుడు ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంటి…?

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}04zibTFZ0mU{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -