Saturday, May 18, 2024
- Advertisement -

తెలంగాణాలో అధికారంలోకి రావాలి

- Advertisement -

2019 లో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఉద్బోధ చేసారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ‌్లు పూర్తి అయిన సందర‌్భంగా చేపట్టిన వికాస్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా ఇక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మనం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాయి. ఇక మూడేళ్లు మాత్రమే ఉంది. అంటే వెయ్యి రోజులు ఉంది. ఈ కాలంలో మనం ప్రణాళికాబద్దంగా పని చేస్తే విజయం తథ్యం అని ఆయన అన్నారు. తెలంగాణలో పార్టీని విస్తరిస్తామని, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తామని కార్యకర్తల చేత చెప్పించారు. ఎన్డియే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందని, ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి లేదని, నిరంతరం 10 జన్ పథ్ చుట్టూ తిరగడానికే ఆ పార్టీ నాయకులకు సమయం సరిపోయిందని అన్నారు. ఇక పార్టీ శాసనసభా పక్ష నేతగా కిషన్ రెడ్డి ఎంపికయ్యారు. ఆయనను పార్టీ ఎమ్మెల్యేలు అమిత్ షా సమక్షంలోనే తమ నేతగా ఎన్నుకున్నారు. దీంతో పార్టీ జాతీయ కార్యవర్గంలో స్ధానం కోసం పోటీ పడదామనుకున్న కిషన్ రెడ్డి ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -