Sunday, May 19, 2024
- Advertisement -

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తాజాగా తెరపైకి..

- Advertisement -

తెలంగాణ బీజేపీ నేతల లాబీయింగ్ ఫలిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి కీలక బాధ్యతలు చేపట్టాక తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా కేసీఆర్ తో సాన్నిహిత్యంగా ఉంటూ వస్తున్న గవర్నర్ నరసింహన్ ను మార్చాలని బీజేపీ నేతలు ఇప్పటికే హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు.

తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహాయ మంత్రి కిషన్ రెడ్డిలు కీలక భేటి జరిపినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఉమ్మడి ఏపీ గవర్నర్ నరసింహన్ ను మార్చాలని డిసైట్ అయినట్టు ఢిల్లీ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈయన స్థానంలో బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న సుష్మా స్వరాజ్ ను, పాండిచ్చేరి గవర్నర్ కిరణ్ బేడిని నియమించాలని యోచిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు మహిళా గవర్నర్లను నియమించేందుకు కేంద్ర హోంశాఖ డిసైడ్ అయినట్టు సమాచారం. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ కు ఏపీ కొత్త గవర్నర్ కోసం రాజ్ భవన్ సిద్ధం చేయాలని ఆదేశాలు అందాయట.. ఆయన విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు.

ఇక తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టి బీజేపీ ఇక్కడ కేసీఆర్ కు కొరకరాని కొయ్యలాంటి బీజేపీవాదినే గవర్నర్ గా నియమించాలని యోచిస్తున్నారు. ఇక ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ను కశ్మీర్ వ్యవహారాల సలహాదారుగా నియమించాలని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -