Tuesday, May 21, 2024
- Advertisement -

టీడీపీకి మరో షాక్.. చింతమనేని అరెస్ట్!

- Advertisement -

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.బుధవారం పెదవేగీ మండలంలోని బి.సింగవరంలో చింతమనేని ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన వెళ్లిపోయాక సింగవరంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి.గొడవలకు ప్రేరేపించారనే ఆరోపణలతో పోలీసులు ఆయనను ఈ రోజు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఘటనాస్థలంలో చింతమనేని లేకున్నా ఈ కేసులో ఆయన పేరు చేర్చి అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనినేని ప్రభాకర్​ను అరెస్టు చేయటం అప్రజాస్వామికమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో వైసిపిను ఓటమి భయం వెంటాడుతున్నందునే.. చింతమనేనిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. టిడిపి నేతల అక్రమ అరెస్టులు సీఎం జగన్ పిరికిపంద చర్యలకు నిదర్శనమన్నారు.

బి.సింగవరం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన సమయంలో అక్కడ లేని వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చెయ్యటం రాజారెడ్డి రాజ్యాంగానికి మాత్రమే చెల్లిందని దుయ్యబట్టారు. వైసిపి యూనిఫాం వేసుకొని వారు చెప్పినట్లు నడుచుకుంటున్న కొందరు పోలీసు అధికారులు.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు. తక్షణమే చింతమనేనిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

దాల్చిన చెక్క‌తో క‌లిగే లాభాలు!

మ్యాక్స్​వెల్ కి భారీ రేటు..బెంగుళూరు జోరు..!

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్ కి..చెన్నై సూపర్ కింగ్స్ బలే రేటు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -