Saturday, May 18, 2024
- Advertisement -

జ‌గ‌న్ ప్ర‌శ్న‌ల‌కు ఉక్కిరి బిక్కిరి అయిన అధికారులు…

- Advertisement -

సీఎం హోదాలో తొలిసారి పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించారు వైఎస్ జ‌గ‌న్ . అక్కడ జరుగుతున్న ప్రాజెక్టు పనుల స్థితి గ‌తుల‌ను పరిశీలించిన ఆయన.. కాఫర్ డ్యామ్ పనులు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప‌రిస్థితిపై జగ‌న్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌లేక అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

హెలికాప్టర్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న సీఎం జగన్… ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్ట్‌ను పరిశీలించిన సీఎం జగన్… కాఫర్ డాం, సాంకేతిక అంశాలపై అధికారులను లోతుగా ప్రశ్నించారు. వరద వచ్చేనాటికి కాఫర్ డ్యామ్ పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అధికారులను ప్రశ్నించారు. అనుకున్న సమయానికి కాఫర్ డ్యామ్ పూర్తి చేయకపోవడం వల్ల ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది కదా అని ఆయన ప్రశ్నించారు.

గత ప్రభుత్వం మాదిరి పోలవరంపై ఆర్భాటపు ప్రకటనలు చేయకుండా పనులపై ఎక్కువ దృష్టి పెట్టాలని జగన్ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఇప్పటివరకు ప్రాజెక్ట్ ఎంతవరకు పూర్తయింది.. ఇంకా ఎంత పని జరగాల్సి ఉంది వంటి వివరాలను అధికారుల నుంచి జగన్ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది.

అలాగే టెండర్స్, కాంట్రాక్టర్ల వివరాలను కూడా జగన్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ప్రాజెక్టుకు సంబంధించి తనకున్న సాంకేతిక సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు పునరావాస చర్యలపై అసలు దృష్టి పెట్టకపోవడంతో.. ఆ దిశగా చర్యలను వేగవంతం చేయాలని అధికారులను జగన్ ఆదేశించినట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -