Wednesday, May 15, 2024
- Advertisement -

పోతూ పోతూ బాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు…ఆర్థిక మంత్రి బుగ్గ‌న నిప్పులు

- Advertisement -

ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా గ‌త టీడీపీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోతూ పోతూ బాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశార‌ని మండిప‌డ్డారు. 2004-2009 వరకు ఏపీ స్థూల ఉత్పత్తి 12శాతం పెరిగిందన్నారు. 2014-19 మధ్య ఏపీకి గడ్డు కాలం నడిచిందన్నారు. అదే కాలంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైందన్నారు. 2014-15లో మైనస్ వృద్దిరేటు నమోదైందన్నారు.

ఎఫ్‌ఆర్‌బీఎం యాక్ట్ ప్రకారం ఏపీ స్థూల ఉత్పత్తిలో 3శాతం మాత్రమే అప్పు చేయవచ్చని, కానీ 2015 నుంచి ప్రభుత్వం పరిధి దాటి మరీ అప్పు చేసిందన్నారు.ఎక్కడా పనికొచ్చే ఖర్చు చేసినట్టు లేదని.. దుబారా ఖర్చులు,వృథా ఖర్చులు ఎక్కువగా చేశారని అన్నారు.అప్పు చేస్తే.. లాభదాయకంగా ఉండేలా ఖర్చు చేయాలని, గత ప్రభుత్వం అందుకు విరుద్దంగా అనవసర ఖర్చులు చేసిందన్నారు.

టీడీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని, హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని అన్నారు. కాంట్రాక్టర్లకు తప్ప ఎవరికీ బిల్లులు చెల్లించలేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి రూ.3.62లక్షల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయన్నారు.

చంద్రబాబు పాలనలో ఐదేళ్లూ ఆర్థిక పరిస్థితి ఓవర్ డ్రాఫ్టులోనే ఉందని, దాదాపు రూ.18 వేల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్ లో పెట్టారని ఆరోపించారు. 2018-19కి గాను ఏపీ పవర్ డిస్కమ్స్ కు దాదాపు రూ.8000 కోట్లు రావాల్సి ఉంటే, కేవలం రూ.2500 కోట్లు ఇచ్చారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పౌరసరఫరాల శాఖ తరఫున రూ.4800 కోట్లు తీసుకుని వాటిని వేరే కార్యక్రమాల కోసం వినియోగించారని ఆరోపించారు. ఏంటని నిలదీస్తే పసుపు-కుంకుమ పేరు చెబుతారని విమర్శించారు.

ఆఖరికి చంద్రన్న కానుకలు కూడా పౌరసరఫరాల డబ్బుతోనే కొనుగోలు చేశారని మంత్రి తెలిపారు. ఏ శాఖలో చూసినా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు కచ్చితంగా చెల్లించారని, కానీ అంగన్ వాడీ వర్కర్లకు, మధ్యాహ్న భోజనానికి, ఔట్ సోర్సింగ్ వర్కర్ల జీతాలు, హోంగార్డుల జీతాలు, చివరికి వ్యవసాయానికి సంబంధించిన విత్తనాల బిల్లులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయంటూ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -