Tuesday, May 14, 2024
- Advertisement -

వైఎస్ వివేకా హత్యకేసులో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న వైఎస్ జ‌గ‌న్ …

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జ‌గ‌న్ బాబాయ్ వైఎస్ వివేకా హ‌త్య కేసులో కొత్త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పాత సిట్‌ను ర‌ద్దు చేసి 23 మంది అధికారుల‌తో కొత్త సిట్‌ను ఏర్పాటు చేసింది నూత‌న ప్ర‌భుత్వం. కడప ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన 23 మంది పోలీసులతో కొత్త సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ వివేకా హత్య జరిగిన పులివెందులలోని ఇంటిని బుధవారం సాయంత్రం పరిశీలించింది.

మార్చి 15వ తేదీన పులివెందులలోని తన నివాసంలో దారుణహత్యకు గురయ్యారు వైఎస్ వివేకానందరెడ్డి. బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో ఉన్న ఆయన్ని అనుచరులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో కింద పడిపోయి తీవ్ర గాయాలపాలై మృతిచెందినట్టు మొదట తెలిపినా… పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం ఆయ హత్యకు గురైనట్లు తేలింది. ఈ హ‌త్య‌పై వైసీపీ, టీడీపీలు ఒక‌రిమీద ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక కేసులో టీడీపీ సర్కార్ సిట్ ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించినా పురోగ‌తి లేక‌పోవ‌డంతో కొత్త సిట్‌ను ఏర్పాటు చేసింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -