Tuesday, May 14, 2024
- Advertisement -

బంగినపల్లి.. తెల్ల చక్కరకేళి సహా మరో మూడింటికి ఛాన్స్

- Advertisement -

మన ఉత్పత్తులని గర్వంగా చెప్పుకునే బంగినపల్లి మామిడిపళ్లు, తెల్ల చక్కరకేలి అరటి పళ్లు, పలాస జీడిపప్పు, దుగ్గిరాల పసుపు, కర్నూలు ఉల్లి పాయలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ఐదు ఉత్పత్తులను మరో పేర్లతో పిలవకుండా విక్రయించేందుకు వీలు లేకుండా చర్యలు తీసుకుంటోంది.

ఇందుకోసం నేషనల్ సిల్క్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలో వీటి పేర్లను రిజిస్టర్ చేయాలని ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల నుంచి వివిధ ఉత్పత్తులను సేకరిస్తున్న కొన్ని సంస్ధలు ఆ ఉత్పత్తులకు ఆ కంపెనీల పేర్లు పెట్టి మార్కెట్ లో విక్రయిస్తున్నాయి. దీంతో మన ఉత్పత్తుల పేర్లు మారుతున్నాయి.

దీంతో మన ఉత్పత్తుల పేర్లను మార్చకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇక నుంచి ఏ కంపెనీ అయినా మన ఈ ఐదు ఉత్పత్తులను విక్రయించాలనుకుంటే ఆ పేర్లతోనే విక్రయించాల్సి ఉంటుంది. ఈ పంటలకున్న విశిష్టత పోకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు ఎపి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -