Tuesday, May 21, 2024
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వానికి ఎపి ప్రభుత్వం లేఖ

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో విధులు నిర్వర్తించుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో తెలంగాణ సచివాలయాన్ని ఖాళీ చేస్తుందని ఎపి ప్రభుత్వం లేఖ రాసింది. నిజానికి పదేళ‌్ల వరకూ సచివాలయాన్ని వాడుకోవచ్చునని రాష్ట్రాల విభజన సమయంలో పేర్కొన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ నెలాఖరుకు సచివాలయాన్ని ఖాళీ చేయాలని భావిస్తోంది.

ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు అమరావతికి రావాలంటూ హుకుం జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని ఇక్కడి నుంచి పంపించేలా సచివాలయాన్ని ఖాళీ చేస్తోంది. అయితే సచివాలయంలో ఎపి ముఖ్యమంత్రి కార్యాలయమున్న ఎల్ బ్లాక్ ను ఖాళీ చేయడానికి కొంత సమయం కోరిన ఎపి ప్రభుత్వం ఇతర బ్లాకులను మాత్రం త్వరితగతిన ఖాళీ చేయాలని భావిస్తోంది.

అందుకే తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. అయితే హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లేందుకు ఎపి ఉద్యోగులు వెనుకడుగు వేస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హఠాత్తుగా సచివాలయాన్ని ఖాళీ చేయాలనుకోవడం, ఇలా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడంపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడ కార్యాలయమే లేకపోతే ఉద్యోగులు ఎక్కడ కూర్చుని పని చేస్తారని, అందుకే బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు ఎపి ప్రభుత్వం చేసిన ఆలోచనే ఇదని ఉద్యోగులు అంటున్నారు.  ప్రభుత్వ ఆలోచన ఏదైనా సచివాలయం మాత్రం పూర్తి స్ధాయిలో తెలంగాణ ప్రభుత్వ హయాంలోకి వెళ్లిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -