Saturday, May 18, 2024
- Advertisement -

ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న షురూ

- Advertisement -

ఉబ్బసం రోగులకు ప్రతి ఏటా ఇచ్చే చేప ప్రసాదాన్ని బుధవారం నాడు పంపిణీ చేయనున్నారు. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా బత్తిన సోదరులు ఈ చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. మ్రగశిర కార్తే ప్రారంభం రోజున చేప ప్రసాదం పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా అలాగే చేయనున్నారు.

బుధవారం ఉదయం నుంచి తొమ్మిదో తేది ఉదయం వరకూ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ మందును ఇస్తారు. బుధవారం ఉదయం బత్తిన సోదరులు పాతబస్తీలోని తమ ఇంట్లో సత్యనారాయణ స్వామి వత్రాన్ని చేసిన అనంతరం చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. అనంతరం దాన్ని తీసుకుని ఎగ్జిబిషన్ మైదానానికి వచ్చి అక్కడ దీన్ని పంపిణీ చేస్తారు. చేప మందు పంపిణికీ ఈ ఏడాది 32 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఎక్కడా తొక్కిసలాట జరగకుండా పురుషులు, మహిళలు, వికలాంగులు, విఐపిలు ఇలా ఒక్కోక్కరికి ఒక్కో క్యూలైను ఏర్పాటు చేస్తున్నారు. చేప ప్రసాదం కోసం నాలుగు లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారని, కౌంటర్ల వద్ద 15 రూపాయలకు చేప పిల్లను విక్రయిస్తారు. ఇందుకోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 100 ఆర్టీసి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 35 సిసి కెమెరాలతో కూడా నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -