Monday, May 6, 2024
- Advertisement -

ఆధార్ హ్యాక్ చేస్తే.. ప్రభుత్వం రివార్డ్ ఇస్తుందట !

- Advertisement -

ప్రస్తుతం ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ అనేది తప్పనిసరిగా మారిన గుర్తింపు కార్డు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునేందుకు, ఓటర్ కార్డ్ నమోదు చేసుకునేందుకు, భూ వివరాలు నమోదు చేసుకునేందుకు.. ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్యుడికి అవసరమేయ్యే ప్రతి దాంట్లో కూడా ఆధార్ తప్పనిసరిగా మారింది. దీంతో ప్రతి ఒక్కరూ కూడా వారి అవసరానికి తగినట్లుగా చాలా చోట్ల ఆధార్ వివరాలు ఇవ్వాల్సి వస్తుంటుంది. దీంతో ఇతరుల ఆధార్ వివరాలను కొందరు మిస్ యూస్ చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఆధార్ వివరాలను సేకరించి మొబైల్ ఓటిపిల ద్వారా బ్యాంక్ అకౌంట్లలోని నగదు కాజేస్తుంటారు కొందరు ఆన్లైన్ మోసగాళ్ళు.

అయితే ఆధార్ పట్ల డిజిటల్ సెక్యూరిటీ కూడా చాలా దృఢంగానే ఉంచుతోంది UIDAI సంస్థ. ఇప్పటివరకు 1.33 బిలియన్ బారతీయులు ఆధార్ నమోదు చేసుకున్నారు. వారి యొక్క వివరాలు అన్నీ కూడా UIDAI చాలా ప్రైవసీ గా ఎంతో భద్రత తీసుకొని గోప్యంగా ఉంచుతోంది. అయితే కొందరు ఎథికల్ హ్యాకర్స్ ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలిచే అవకాశం లేకపోలేదు.. దాంతో ఈ ఆధార్ ప్రైవసీ ని పరీక్షించేందుకు 20 ఎథికల్ హ్యాకర్స్ ను రిక్రూట్ చేసుకోనుంది.

ఒకవేళ 20 మందిలో ఆధార్ ను హ్యాక్ చేసిన వారికి రివార్డ్ కూడా ప్రకటించింది UIDAI. ఆధార్ డేటా భద్రత లోని లొసుగులపై ఎన్నో పిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆధార్ డేటా కు మరింత భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ 20 మంది ఎథికల్ హ్యాకర్స్ కు ఉండాల్సిన అర్హతలను కూడా తెలిపింది ఆధార్ సంస్థ. HACKERONE, BUGCROWD వంటి వాటిలో ఎథికల్ హ్యాకర్ గా టాప్ 100 స్థానం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది. లేదా మైక్రో సాఫ్ట్, గూగుల్, ఫేస్ బుక్, యాపిల్ వంటి ప్రసిద్ద కంపెనీలలో బౌంటీ ప్రోగ్రామర్ గా విధులు నిర్వహించి ఉండాలని యూ‌ఐ‌డి‌ఏ‌ఐ సూచించింది..

More Like This

భిక్షాటనను.. నిషేదించిన గవర్నమెంట్ ?

కష్టాల్లో నెట్ ఫ్లిక్స్ ..గట్టెక్కేనా ?

ఇండియాను విడిచిపెడుతున్న భారతీయులు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -