Saturday, April 20, 2024
- Advertisement -

జోరు పెంచిన బాలయ్య.. మరో సెన్సేషనల్ డైరెక్టర్తో..

- Advertisement -

కుర్రహీరోలకు ఏ మాత్రం తక్కువు కాదన్నట్టే నందమూరి నటసింహం వరుస సినిమాలను తెరకెక్కిస్తూ మాంచి జోష్ లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈ సీనియర్ స్టార్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్నఈ మూవీని మహానటుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని విడుదల చేయనున్నారు. ఈ మూవీలో బాలయ్య డ్యయల్ రోల్ లో కనిపించనున్నారు.

ఒకటి అఘోర పాత్ర అయితే.. మరోటి కలెక్టర్ పాత్రలో బాలయ్య కనిపించనున్నాడు. ‘బిబి3’వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగాలనే బాలయ్య.. డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థగా సత్తా చాటుకుంటున్న మైత్రీ మూవీ మేకర్స్ పై నిర్మించబడుతోంది.

బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ పాత్రలో కనిపించబోతున్నారట. అలాగే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత బాలయ్య సెన్సెషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ డైరెక్టర్ బాలయ్యకు కథను కూడా వినిపించాడట. అయితే గోపీచంద్ మలినేనితో, అనిల్ రావుపూడి తో ఓకే సారి సినిమాలు చేయనున్నట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్-5లో స్టార్ సింగర్ హేమచంద్ర !

క్రేజీ ఫాదర్ అండ్ డాటర్ !

ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?

భారీగా రేటు పెంచిన బుట్టబొమ్మ !

అయ్యయ్యో.. పవన్ సినిమాకు కూడా లీకుల దెబ్బ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -