Sunday, May 19, 2024
- Advertisement -

భూమా నాగిరెడ్డి మృతికి చంద్రబాబు కారణం..?

- Advertisement -
Bhuma’s Sudden Demise Complicates Kurnool And Kadapa Elections

భూమా నాగిరెడ్డి మృతికి టీడీపీ కారణం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందుకే తాము ఆ పార్టీతో కలిసి సంతాప తీర్మానం చేయదలచుకోలేదని..  ఆ పార్టీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. భూమా టీడీపీలోకి వెళ్లాక మానసిక సంక్షోబానికి గురయ్యారని తెలిపారు. ఇలాంటి మానసిక క్షోభకు గురి చేయడం చంద్రబాబుకు మామూలే అని.. గతంలో ఎన్టీఆర్‌ను, ఇప్పుడు భూమా నాగిరెడ్డికి అలాగే చేశారన్నారు. టీడీపీలో చేరిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలిపారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపి.. ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురై ఆ క్షోభతోనే ఆయన ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు. భూమాను మోసం చేసిన వారితో సంతాప కార్యక్రమ తీర్మానంలో పాల్గొనకూడదని పార్టీ నిర్ణయించిందని చెప్పుకొచ్చారు. ఈ సంగతి ఇలా ఉంటే.. భూమా నాగిరెడ్డి మృతికి ఆయనలోని నిరాశా నిస్పృహలే కారణమని.. కేబినెట్ పోస్టు ఇవ్వరని తేలాకే.. మానసిక క్షోభతో కళ్లు మూశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు ముందు నుంచి హామీ ఇచ్చారని.. కానీ ఈ సంగతిపై గవర్నర్ నరసింహన్ వద్ద చంద్రబాబు మాట్లాడనప్పుడు.. పార్టీ ఫిరాయించిన వ్యక్తులకు మంత్రి పదవినిస్తే సాంకేతికంగా కూడా చిక్కులు వస్తాయని గవర్నర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని సన్నిహితులు అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -