Sunday, May 19, 2024
- Advertisement -

అసెంబ్లీ ప్రోటెమ్ స్పీక‌ర్‌గా భాజాపా ఎమ్మెల్యేను నియ‌మించిన గ‌వ‌ర్న‌ర్‌…

- Advertisement -

క‌న్న‌డ రాజ‌కీయాల‌లో ఆస‌క్తిక‌ర‌ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపు 4 గంట‌ల‌కు ప్రొటెమ్ స్పీకర్ స‌మ‌క్షంలో బ‌లం నిరూపించుకోవాల‌ని సుప్రీంకోర్టు య‌డ్యూర‌ప్ప‌ను ఆదేశించ‌డంతో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌రవేగంగా మారుతున్నాయి. ర‌హ‌స్య‌బ్యాలెట్ ప‌ద్ద‌తిలో బ‌లం నిరూపించుకుంటామ‌న్న భాజాపా విన్న‌పాన్ని కోర్టు తిర‌స్క‌రించ‌డంతో బ‌ల‌నిరూప‌న‌కు దారులు వెతుకుతోంది భాజాపా.

క‌ర్ణాటక అసెంబ్లీ ప్రొటెమ్ స్పీక‌ర్‌గాబీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కేజే బోపయ్యను ఎంపిక చేశారు. అంతకుముందు, న్యాయ నిపుణులతో కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ చర్చించారు. ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను ప్రోటెమ్ స్పీక‌ర్‌గా గ‌వ‌ర్న‌ర్ నియ‌మించారు.

అసెంబ్లీ స్పీకర్ గా బోపయ్య గతంలో పనిచేశారు. ఇప్పుడు విరాజ్ పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ నిర్ణ‌యాన్ని కాంగ్రెస్‌, జేడీఎస్‌లు వ్య‌తిరేకిస్తున్నాయి. ఎక్కువ సీనియార్టీ ఉన్న తమ ఎమ్మెల్యే దేశ్ పాండేను నియమించకుండా బోపయ్యను ఎలా నియమిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు దేశ్ పాండే 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

బీజేపీ సంఖ్యాబలం 104 కాగా, కాంగ్రెస్ కు78, జేడీఎస్ కు 36, ఇతరులు ముగ్గురు ఉన్నారు. బలపరీక్ష గట్టెక్కేందుకు బీజేపీకి కావాల్సిన సంఖ్యాబలం 112. బ‌ల ప‌రీక్ష‌లో ఎవ‌రు నెగ్గుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -