Friday, May 17, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ ని వశం చేసుకోవడం కోసం బీజేపీ ప్లాన్ లు

- Advertisement -

సినీనటుడు – జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విషయంలో స్పందించకుండా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలోని నేతల నోటికి తాళం వేసిందని అంటున్నారు.

తిరుపతి బహిరంగ సభలో ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి మాట్లాడిన పవన్ భాజపా నేతలు – కేంద్రప్రభుత్వంపై పలుమార్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే పవన్ ఆరోపణలు – విమర్శలపై కమలం పార్టీ నేతలు ఎవరూ ఎదురుదాడికి దిగవద్దని ఘాటుగా స్పందించవద్దని పార్టీ జాతీయ నాయకత్వం నుండి సూచనలు వచ్చినట్లు సమాచారం.

9వ తేదీన కాకినాడలో మరో బహిరంగ సభ నిర్వహిస్తానని పవన్ చేసిన ప్రకటనను జాతీయ నాయకత్వం గుర్తుచేసినట్లు తెలిసింది. ఆ సభ వరకూ ఎవరు కూడా పవన్ పై గట్టిగా మాట్లాడవద్దని – ఆయన చేసిన ఆరోపణలకు – విమర్శలకు సమాధానం చెప్పవద్దని జాతీయ నాయకత్వం స్పష్టమైన సూచన చేసినందు వల్లే రాష్ట్ర నేతలెవరూ స్పందించడం లేదని అంటున్నారు. అప్పటివరకు పవన్ ధోరణిలో ఎటువంటి మార్పు రాకపోతే అప్పుడే ఏమి చేయాలో నిర్ణయించుకోవచ్చని రాష్ట్ర నేతలు కూడా నిర్ణయించుకున్నారు.

ఇదిలావుండగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన అంశంపై ఇటీవల తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించిన పవన్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభు త్వంపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ మాట తప్పుతున్నట్లుగా పవన్ ఆరోపించారు. ప్రధాని గనుక మాట తప్పితే కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తానంటూ తీవ్ర హెచ్చరికలు కూడా చేసారు. తనకు ప్రత్యేకంగా ఏ వ్యక్తితో అనుబంధం కానీ లేదా ఏ అజెండా కానీ లేదన్నారు.  

ప్రజల ప్రయోజనమే తన అజెండా అంటూ పవన్ స్పష్టంగా ప్రకటించారు. ప్రజల కోసం తాను ప్రధానిని సైతం నిలదీయటానికి వెనుకాడనని చెప్పారు. అదే ఊపులో కేంద్రంమంత్రి వెంకయ్యనాయడు – అరుణ్ జైట్లీ లను కూడా విమర్శించారు. పదవులను పట్టుకుని వేలాడవద్దని పార్టీ రాజకీయాలకన్నా దేశ ప్రయోజనాలే ఎక్కువంటూ వెంకయ్యపై విరుచుకుపడ్డారు. అంటే తన స్వార్ధం కోసం – పదవుల కోసం వెంకయ్య రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేకహోదాను కూడా పక్కనబెట్టారని ఆరోపించారు. పనిలో పనిగా తుమ్మితే ఊడిపోయి మంత్రి పదవిని వెంటనే రాజినామా చేయాలంటూ అశోక్ గజపతి రాజును డిమాండ్ చేసారు.

Related 

  1. రెండుగా విడిపోయిన టీడీపీ ఎంపీ లు
  2. బీజేపీ – టీడీపీ తెగదెంపులు ఖాయం .. ఆఖరి తేదీ ఇదే ..
  3. ముఖ్యమంత్రి .. పవన్ కళ్యాణ్ .. సీఎం పవర్ స్టార్
  4. నేను పవన్ కళ్యాణ్ బాగానే ఉంటాం .. ఫ్యాన్స్ హద్దులు దాటకండి – ఎన్టీఆర్
  5. పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం ఆసక్తిగా చూసిన చిరంజీవి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -