Friday, May 24, 2024
- Advertisement -

రెండుగా విడిపోయిన టీడీపీ ఎంపీ లు

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యెక హోదా పార్టీల మధ్య మాత్రమే కాదు పార్టీల లో ఉన్న వ్యక్తుల మధ్య కూడా అంతరాన్ని ఎర్పరుస్తోంది. ఈ విషయం లో ఎలా వ్యవహరించాలి అని పార్లమెంట్ లో ఎలాంటి తీరు తో ఉండాలి అనేదాని మీద టీడీపీ ఎంపీలు వారిలో వారే కొట్టుకుంటున్నారు . ఎలాంటి సందర్భంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేదాని బట్టి విభేదాలు కూడా నెలకొన్నట్టు తెలుస్తోంది.

‘ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ’ పేరుతో కేంద్రం ఇవ్వజూపుతున్న అదనపు ఆర్థిక సహాయాన్ని సాధ్యమైనంత ఎక్కువగా రాబట్టుకొనే ప్రయత్నం చేయాలన్న rపార్లమెంటరీ పార్టీ నాయకుని వైఖరిపై మిగతా ఎంపీలు మండిపడుతున్నారు. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజలకు భావోద్వేగ అంశంగా మారిన వాస్తవాన్ని విస్మరించి కేంద్రంతో రాజీపడితే రాజకీయంగా తీవ్రంగా నష్టపోక తప్పదని కొందరు వాదిస్తున్నారు.

మరికొందరు మాత్రం ఇక కేంద్రం ఎట్టిపరిస్థితుల్లోనూ హోదా ఇవ్వదు కాబట్టి వీలైనంత భారీగా ప్యాకేజీ సాధించుకోవాలని అంటున్నారు. ఈ భిన్నాభిప్రాయాలతో టీడీపీ ఎంపీలు నిలువునా చీలిపోయారు. నిత్యం వాదులాటలు.. ఏకాభిప్రాయం లేని చర్చలతో గడుపుతున్నారు.  దీంతో ఆ పార్టీలోనే క్లారిటీ లేదన్న విషయం స్ప్రెడ్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -