Saturday, May 18, 2024
- Advertisement -

బీజేపీ న‌న్ను ఎన్ కౌంటర్ చేసి చంపాలని చూసింది…ప్ర‌వీన్ తోగాడియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

- Advertisement -

కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీనే అందరికీ తెలుసు. కానీ భాజపాను వెనకుండి నడిపించేది ఆర్ఎస్ఎస్, విహెచ్పీ అన్నమాట ఎప్పటి నుండో వినబడుతున్నదే. కేంద్రప్రభుత్వాన్నే వెనకుండి నడిపిస్తున్నాయంటే ఆ సంస్ధలు, వాటి అధిపతులు ఇంకెత పవర్ ఫుల్ గా ఉండాలి? కానీ సీన్ మాత్రం రివర్స్ లో నడుస్తోందని అనిపిస్తోంది.

ఒకరోజు పాటు ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయి, ఆపై అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో కనిపించిన విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా, బీజేపీపై సంచలన విమర్శలు చేశారు. తన ను ఎన్ కౌంటర్ చేసి చంపాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. తన మౌనాన్ని వీడిన ఆయన, “దాదాపు పదేళ్ల క్రితం నాటి కేసులో నన్ను టార్గెట్ చేశారు. రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేసేందుకు వచ్చారు. నన్ను చంపాలని ప్రణాళిక వేసినట్టు కొందరు నాకు తెలిపార‌న్నారు.

ఆయన మాటలు చూస్తుంటే ప్రవీణ్ తొగాడియా ఎన్ కౌంటర్ కు రంగం సిద్ధమైందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. పదేళ్ళనాటి కేసుపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాజస్ధాన్, గుజరాత్ ప్రభుత్వాలు తనను వేధిస్తున్నాయంటూ మండిపడ్డారు. 2001లో ఓ అల్లర్ల కేసులో తొగాడియాపై అరెస్టు వారెంటు జారీ అయ్యింది. అయితే, అప్పటి నుండి తొగాడియా పోలీసుల కన్ను గప్పి తిరుగుతూనే ఉన్నారు. మొన్న కూడా అరెస్టు వారెంటు అందించేందుకు పోలీసులు పార్టీ కార్యాయంకు వెళ్ళగా అప్పటికే కార్యాలయం నుండి తప్పించుకున్నారు. అయితే, సాయంత్రం ఓ పార్కులో అపస్మారకస్ధితిలో కనిపించారు. దాంతో స్ధానికులు తొగాడియాను ఆసుపత్రిలో చేర్పించారు.

రామమందిరం, గో సంరక్షణ, రైతులకు సంక్షేమ పథకాలు తదితరాంశాలపై నేను ప్రశ్నిస్తున్నందునే ఈ పరిస్థితి ఎదురైందని, ఎవరు నాపై దాడికి యత్నించాలని చూశారన్న విషయం మాత్రం తెలియదని చెప్పారు. కాగా, ప్రవీణ్ తొగాడియా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వైద్యలు తెలిపారు. జెడ్ క్యాటగిరీ రక్షణలో ఉన్న ఆయన నిన్న ఉదయం మాయం కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. బీజేపీపై చేసిన ఆరోప‌న‌లు ఎలాంటి ప‌రినామాల‌కు దారి తీస్తాయో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -