- Advertisement -

శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌న‌ల్లో న‌మ్మ‌లేని నిజాలు వెల్ల‌డి..

- Advertisement -

ర‌క్త పిశాచాల‌ను సినిమాల్లో త‌ప్ప నిజంగా ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన వారెవ్వ‌రు లేరు. రక్తపిశాచాలకు సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవంలో ఇవి ఉన్నాయా? ఉంటే ఎలా వచ్చాయి? అన్నదానిని అమెరికాలోని బోస్టన్ పిల్లల కేన్సర్, రక్తవ్యాధుల కేంద్రం పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో గుర్తించారు. రక్తపిశాలు కూడా మనుషులేనని వారు అభిప్రాయపడ్డారు. తాజాగా వీటి గుట్టును శాస్త్ర‌వేత్త‌లు బ‌య‌ట పెట్టారు. వారి ప‌రిశోధ‌న‌ల్లో భ‌యంక‌ర‌మైన నిజాలు వెల్ల‌డ‌య్యాయి.

రక్తపిశాచాలకు సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవంలో ఇవి ఉన్నాయా? ఉంటే ఎలా వచ్చాయి? అన్నదానిని అమెరికాలోని బోస్టన్ పిల్లల కేన్సర్, రక్తవ్యాధుల కేంద్రం పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో గుర్తించారు. రక్తపిశాలు కూడా మనుషులేనని వారు అభిప్రాయపడ్డారు.

ప్ర‌ధానంగా బాల్యంలో సంభవించే ఎరిథ్రోపొయిటిక్‌ ప్రోటోపోరిఫైరియా (ఈపీపీ)గా పిలిచే రుగ్మతను రక్తపిశాచంగా భావించి ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఇది వాస్తవానికి అతీత శక్తి కాదని, అరుదైన జన్యుపరమైన రుగ్మత అని వారు చెబుతున్నారు. రక్తంలో ఆక్సిజన్‌ ను తీసుకుపోయే హిమోగ్లోబిన్‌ లో ‘హీమ్‌’గా పిలిచే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఈ సమ్మేళనాలు తీవ్రంగా ప్రభావితం చేసిన వారు ఈపీపీ బారిన పడతారని వారు వెల్లడించారు.

వీరు ఎండలో గడపలేరని. సూర్యరశ్మి తగిలితే వారి చర్మంపై విపరీతమైన బాధ కలిగించే పొక్కులు పుట్టుకొస్తాయని తెలిపారు. ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉండేవారు తీవ్రమైన రక్తహీనతతో బాధపడతారని వారు చెప్పారు. వీరు పగటిపూట అయినా ఎండ లేనప్పుడైనా అస్సలు బయటకురాలేరని అన్నారు.

ఒకవేళ ఎండలేనప్పుడు ధైర్యం చేసి, బయటకువచ్చినా వారి చెవులు, ముక్కు, కళ్లు సహా శరీరభాగాలన్నీ బొబ్బలతో వికృతంగా మారిపోతాయని పరిశోధకులు తెలిపారు. ఈ వ్యాధికి కారణమైన జన్యుపరివర్తనలను సైతం తాము గుర్తించామని ఈ పరిశోధనల్లో భాగం పంచుకున్న బెర్రీ పా వెల్లడించారు. వైద్య‌స‌దుపాయం, సౌన్స్‌ అందుబాటులోలేని రోజుల్లో వ్యాధితో బాద‌ప‌డేవారు రాత్రిపూట సంచ‌రిస్తూ జంతు రక్తాన్నీ తాగడం లాంటివి చేసి ఉండొచ్చ‌ని అందికే వారిని ర‌క్థ‌పిశాచాలుగా భావించి ఉంటార‌ని అభిప్రాయ ప‌డ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -