Thursday, May 16, 2024
- Advertisement -

ఆధునిక బుల్లెట్ ఫ్రూఫ్ ఏంటో తెలుసా..?

- Advertisement -

మనం అనుకోకుండానే అరుదుగా వినే పేరు గ్రాఫీన్ . మనకు తెలిసి ఈ పేరు పెన్సిల్ వర్క్ టైమ్ లో ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. పెన్సిల్‌ తో ఓ కాగితాన్ని నలుపు చేస్తే.. ఆ నలుపు రంగు పొరనే గ్రాఫీన్‌ అంటారు. దీనికి బుల్లెట్ ఫ్రూఫ్ కు లింకేంటి అనే కదా మీ డౌట్. అందుల్లోకే వస్తున్నాం. ఈ రకమైన గ్రాఫీన్‌ పొరలు రెండింటిని సక్రమంగా అతికిస్తే చాలు… బుల్లెట్లను కూడా తట్టుకోగల వినూత్న పదార్థం రెడీ అయిపోతుందట. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. వినడానికి కాస్త తేడాగా ఉన్నా ఇది మాత్రం నిజం. వజ్రం మాదిరిగానే గ్రాఫీన్‌ కూడా కార్బన్‌తోనే తయారవుతుంది. ఒక పొర గ్రాఫీన్‌ను చూస్తే… అందమైన డిజైన్‌తో కూడిన ఇనుప ఫెన్సింగ్‌ మాదిరిగా ఉంటుంది. ఈ ఆకారం కారణంగానే గ్రాఫీన్‌కు కొన్ని అద్భుతమైన లక్షణాలు వచ్చిపడతాయట.

ఈ పొరలలో మూడు ఎలక్ట్రాన్లు గట్టిగా బంధం ఏర్పరచుకుని ఉంటే.. నాలుగో ఎలక్ట్రాన్‌ విడిగా ఉంటుంది. ఇది కూడా ఇంకో కార్బన్‌ పరమాణవుతో ముడిపడితే… గ్రాఫీన్‌ కాస్తా వజ్రంగా మారిపోతుంది. అంటే వజ్రమంత శక్తివంతంగా మారిపోతుందట. దీని దృష్ట్యా సిటీ యూనివర్శిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ శాస్త్రవేత్తలు.. తగినంత బలంతో కొడితే రెండు పొరల గ్రాఫీన్‌ కాస్తా వజ్రం వంటి దృఢమైన పదార్థంగా మారిపోయేలా చేశారు. అకస్మాత్తుగా వచ్చిపడే బలం కారణంగా గ్రాఫీన్‌లో విడిగా ఉన్న ఎలక్ట్రాన్లు ఇతర పరమాణవులతో బంధం ఏర్పరచుకోవడం దీనికి కారణంగా కనిపిస్తుంది. ఇప్పుడు… రెండు గ్రాఫీన్‌ పొరల పూత ఉన్న ఓ జాకెట్‌ను ఊహించుకుందాం. దాని పైకి రయ్యిమని ఒక బుల్లెట్‌ దూసుకొచ్చిందనుకుందాం. ఆ శక్తి కాస్తా గ్రాఫీన్‌ పొరలను దృఢంగా మార్చేస్తుంది కాబట్టి… బుల్లెట్‌ లోపలికి దిగకుండా అక్కడే ఆగిపోతుంది! అతి పలుచగా ఉండటమే కాకుండా బుల్లెట్లను కూడా తట్టుకోగల జాకెట్‌ రెడీ అవుతుందన్నమాట

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -