Wednesday, May 22, 2024
- Advertisement -

మాజీ మంత్రి చిదంబ‌ర ఇంట్లో సీబీఐ సోదాలు..

- Advertisement -
CBI raids former union minister P Chidambaram and son Karti’s Chennai residences

కేంద్ర మాజీమంత్రి, కాం,గ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం నివాసంలో మంగళవారం సీబీఐ సోదాలు చేసింది. చెన్నైలో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఇంట్లోనూ సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు.

అలాగే తమిళనాడు వ్యాప్తంగా 14 ప్రాంతాలతో పాటు ఢిల్లీ, నోయిడాలోనూ సీఐబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది.ఇప్పుడు రాజ‌కీయాల‌ల్లో సంచ‌ల‌నంగా మారింది.
ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో చిదంబరం, ఆయన కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, ఐటీశాఖ పలుసార్లు చిదంబరం నివాసాలపై దాడులు చేపట్టింది. ఈ కేసులో చిదంబరం పాత్రపై నివేదిక కూడా రూపొందిస్తున్నట్లు ఇటీవల ఐటీశాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసులో చిదంబరంపై విచారణ చేపట్టాల్సిందిగా సీబీఐని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ మేరకు నేడు సీబీఐ సోదాలు చేపట్టింది.

{loadmodule mod_custom,Side Ad 1}

2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందానికి అనుమతించారని భాజపా నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. మరోవైపు ఈ కుంభకోణంలో చిదంబరం తనయుడు కార్తీ ఓ విదేశీ కంపెనీ నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వీరిద్దరిపైనా సీబీఐ దృష్టి పెట్టింది.అలాగే రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 108 అంబులెన్స్ సేవల్లో చోటుచేసుకున్న అవినీతిలో కార్తీ చిదంబరానికి వాటా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -