Thursday, April 25, 2024
- Advertisement -

సిబిఐ చేతికి ఉప ముఖ్యమంత్రి.. పక్కా వ్యూహమేనా ?

- Advertisement -

ప్రస్తుతం దేశంలో బిజెపి వ్యతిరేక పార్టీల నేతలపై ఈడీ, సిబిఐ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలా చాలా మందే ఈడీ కేసులలో ఇరుక్కుంటున్నారు. అయితే ఇలా ఈడీ దాడులలో కేవలం బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలు మాత్రమే ఉండడం గమనార్హం. ఇక తాజాగా బీజేపీ గురి ఆమ్ ఆద్మీ పార్టీపై పడినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆప్ టార్గెట్ గా మోడీ విమర్శనస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మోడీ ఆప్ పై ఫోకస్ చేయడానికి కూడా కారణం లేకపోలేదు.. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ హోదా కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే డిల్లీ తో పాటు పంజాబ్ లో కూడా ప్రభుత్వాన్ని స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు గుజరాత్ పై ఫోకస్ పెట్టింది.. ఒకవేళ గుజరాత్ లో ఆప్ గెలిస్తే.. జాతీయ పార్టీ హోదా లభించడం ఖాయం. అందువల్ల సమయం దొరికినప్పుడల్లా మోడీ.. అరవింద్ కేజృవాల్ పై విమర్శలు సంధిస్తున్నారు. ఇదిలా ఉండగా డిల్లీ ఉపముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనిష్ సిసోడియా ఎక్సైజ్ పాలసీ స్కామ్ లో సిబిఐ దాడులను ఎదుర్కోవడం డిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. అయితే సీబీఐ పట్ల ఆప్ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు.. ” పంజరంలో చిలుక సీబీఐ ఇప్పుడే బయటకు వచ్చిందని.. దాని ఈకలు కాషాయ రంగులో ఉన్నాయని ” రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ ఘాటుగా విమర్శించారు.

ఇదిలా ఉంటే ఎక్సైజ్ పాలసీ స్కామ్ లో ప్రధాన నిడితుడు మనిష్ సిసోడియా అయినప్పటికి దాని సూత్ర దారి మాత్రం డిల్లీ సి‌ఎం అరవింద్ కేజ్రీవాల్ అంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. దీంతో కేజ్రీవాల్ పై కూడా సీబీఐ దాడులు జరిగే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికి బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలపై ఇలా ఈడీ, సీబీఐ దాడులు జరగడం పక్కా మోడీ-అమిత్ షా వ్యూహమేనని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

Also Read: రేపిస్టులకు అండగా మోడీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -