Wednesday, May 15, 2024
- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు కోట్లిచ్చారా..?

- Advertisement -

కేర‌ళ‌.. ప్ర‌కృతి విప‌త్తు క‌నీవినీ ఎరుగున‌దే. కేర‌ళ మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి రావాలంటే.. త‌క్కువ‌లో త‌క్కువ ఏడాదైనా ప‌డుతుంద‌ని కేంద్రం సైతం అంచ‌నా వేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విరాళాలు వెల్లువ‌లా కేర‌ళ‌కు స‌హాయం కోసం ఇస్తున్నారు. అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు, సినీ, పారిశ్రామిక రంగాల దిగ్గ‌జాలు ముందుకొచ్చి ఉదారంగా త‌మ స‌హాయం ప్ర‌క‌టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగు సినిమా రంగం నుంచి కూడా పెద్దెఎత్తున స్టార్లు ముందుకొచ్చి స‌హ‌కారం అందిస్తున్నారు. ఎవ‌రికి తోచిన విరాళం వాళ్లు ఇప్ప‌టికే ప్ర‌కించారు. కేర‌ళ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి వాటిని అంద‌జేస్తున్నారు. ఆంధ్ర‌, తెలంగాణ ప్ర‌భుత్వాలు సైతం భారీగా స‌హ‌కారం అంద‌జేశాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కూడా త‌న పార్టీ త‌ర‌ఫున రూ. కోటి విరాళంగా కేర‌ళ‌కు అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. వ్య‌క్తిగ‌తంగా అత్య‌ధిక స‌హాయం అంద‌జేసింది వై.ఎస్‌.జ‌గ‌నే అనే ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో తాజాగా మ‌రో విష‌యం తెర‌పైకి వ‌చ్చింది. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేర‌ళ‌కు రూ.2 కోట్ల‌ను విరాళంగా ప్ర‌క‌టించారంటూ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. జ‌గ‌న్ కంటే ప‌వ‌న్ అధికంగా విరాళం ప్ర‌క‌టించారంటూ అత‌ని అభిమానులు ప్ర‌చారం చేస్తున్నారు. కానీ.. దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ గానీ.. ఆయ‌న జ‌న‌సేన పార్టీ గానీ ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున కేర‌ళ వాసుల‌కు స‌హాయం అందించాలంటూ త‌మ పార్టీ శ్రేణులు, అభిమానుల‌కు ఒక ప్ర‌క‌ట‌న మాత్రం విడుద‌లైంది. జ‌న‌సైనికులంతా కేర‌ళ‌వాసుల స‌హ‌కారానికి ముందుకు రండి, మీకు చేతనైన విధంగా దుస్తులు, నిత్య‌వ‌స‌రాలు, మందులు వంటివి అందించాల‌ని జ‌న‌సేన పార్టీ ఈనెల 21న ఆదేశించింది. బృందాలుగా ఏర్ప‌డి కేర‌ళ స‌హ‌కారానికి ముందుండాలంటూ సూచించింది. ఈ ప్ర‌క‌ట‌న త‌ప్ప‌.. జ‌న‌సేన పార్టీ నుంచి మ‌రేవిధమైన ఆర్థిక స‌హాయానికి సంబంధించిన అధికారిక వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేర‌ళ‌కు రూ.2 కోట్లు ఇచ్చారా.. లేదా.. అనే దానిపై స్ప‌ష్ట‌త లేదు. అయితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేర‌ళ‌కు భారీ విరాళం ప్ర‌క‌టించారంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌దైన శైలిలో స్పందించారు. ప‌వ‌న్ ఇంత పెద్ద‌మొత్తం స‌హాయం చేయ‌డం అభినందించాల్సిన విష‌యం, ఇలాంట‌ప్పుడే స్టార్ల ప‌వ‌రేంట‌నేది బ‌య‌ట‌కొస్తుంద‌న్న అర్థం వ‌చ్చేలా వ‌ర్మ ట్వీట్ చేశారు. కానీ.. ప‌వ‌న్ స‌హాయం ప్ర‌క‌టించారో లేదో స్ప‌ష్ట‌త లేద‌ని తెలిస్తే వ‌ర్మ ఎలా స్పందిస్తారో చూడాలి. టాలీవుడ్‌లోని చిరంజీవితో స‌హా టాలీవుడ్ హీరోలు చాలామంది ముందుకొచ్చి కేర‌ళ‌కు వారి స‌హాయాన్ని ప్ర‌క‌టించారు. అధికారిక స‌మాచారం ప్ర‌కారం.. టాలీవుడ్ స్టార్లు ఎవ‌రెవ‌రు ఎంతెంత ఇచ్చార‌నే వివ‌రాలు ఇవీ..

చిరంజీవి: 25ల‌క్ష‌లు
రామ్‌చ‌ర‌ణ్‌: 25ల‌క్ష‌లు
మ‌హేశ్‌బాబు: 25ల‌క్ష‌లు
జూనియ‌ర్ ఎన్టీఆర్‌: 25ల‌క్ష‌లు
ప్ర‌భాస్‌: 25ల‌క్ష‌లు
అల్లు అర్జున్‌: 25ల‌క్ష‌లు
చిరంజీవి త‌ల్లి అంజ‌నాదేవి: ల‌క్ష‌
రామ్‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న‌: 10ల‌క్ష‌ల మందులు
విజ‌య్ దేవ‌ర‌కొండ‌: 5ల‌క్ష‌లు
మా అసోసియేష‌న్‌: 10ల‌క్ష‌లు
క‌మ‌ల్‌హాస‌న్‌: 25ల‌క్ష‌లు
సూర్య‌, కార్తి: 25ల‌క్ష‌లు
ధ‌నుష్‌: 15ల‌క్ష‌లు
విశాల్‌: 10ల‌క్ష‌లు
సిద్ధార్థ‌: 10లక్ష‌లు
కీర్తి సురేష్‌: 15ల‌క్ష‌లు
క‌ళ్యాణ్‌రామ్‌: 10ల‌క్ష‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -