Saturday, May 18, 2024
- Advertisement -

జనాభా గుణాంకాలను విడుదల చేసిన కేంద్రం… ఎంతో తెలుసా….?

- Advertisement -

దేశ జనాభా గుణాంకాలను తాజాగా కేంద్రం విడుదల చేసింది. తాజా గుణాంకాల ప్రకారం జనాభా 128.85 కోట్లు. ఇదే సమయంలో నిమిషానికి 49 మంది జన్మిస్తుంటే, 15 మంది మరణిస్తున్నారు. 2017 గణాంకాలు విడుదల కాగా, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ జనాభా 1.45 కోట్లు పెరిగింది.

పౌర నమోదు వ్యవస్థ ద్వారా దేశంలో ఎక్కడ ఎవరు కన్నుమూసినా, జన్మించినా 21 రోజుల వ్యవధిలో ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయించాలి. ఈ వివరాల ఆధారంగా ఏటా జనాభా లెక్కలను కేంద్రం విడుదల చేస్తుంది.ఈ లెక్కల ప్రకారం గ్రామాల్లో కన్నా పట్టణాల్లో జననాల రేటు పెరుగుతోంది.

తెలంగాణలో 3.69 కోట్ల మంది ఉండగా, జనాభా పరంగా 12వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 5.23 కోట్ల మంది ఉండగా, 10వ స్థానంలో ఉంది. అత్యల్పంగా సిక్కిం 6.56 లక్షల జనాభాతో చిట్టచివరి స్థానంలో ఉంది.ఎప్పటిలానే ఉత్తరప్రదేశ్ జనాభా విషయంలో టాప్ లో నిలిచింది. ఈ రాష్ట్రంలో 22.26 కోట్ల మంది ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -