Wednesday, May 15, 2024
- Advertisement -

పార్టీ పై  చంద్ర‌బాబుకు పట్టు తప్పుతోందా…?

- Advertisement -
Chandrababu Naidu losing out key leaders

టీడీపీ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణకు మారుపేరు.  అధ్య‌క్షుడు ఏ నిర్ణ‌యం తీసుకున్నా దానికి అంద‌రూ క‌ట్టుబ‌డాల్సిందే. కానీ రాను రాను పార్టీలో దిక్కార స్వ‌రాలు పెరుగుతున్నాయి.  ఎప్పుడూ లేనంత‌గా ఇప్పుడు  పార్టీలో   చంద్ర‌బాబుకు ఎదురుగాలులు వీస్తున్నాయి.

ఎంత వార్నింగ్ ఇచ్చినా  వారిలో మార్పురాక‌పోగా మ‌రింత ధిక్కాస్వ‌రాలు పెంచుతున్నారు.  నిన‌కాక మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారు బాబును విమ‌ర్శించ‌డం మొద‌లు పెట్టారు.  దీన్ని బ‌ట్టి చూస్తే బాబు పార్టీమీద‌,నాయ‌కుల‌మీద ప‌ట్టుకోల్పోతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌ను ఏముహూర్తంలో విస్త‌రించారోగాని బాబుకు అప్ప‌టినుంచి ఎన్న‌డూ లేన‌ట్లుగా టీడీపీ హాల్ మార్క్ లాంటి క్ర‌మ‌శిక్ష‌ణ ప‌ట్టుత‌ప్పిపోయింది.  పార్టీ పిరాయించిన వారికి  మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించార‌నీ బొండా ఉమా,బొజ్జ ల గోపాల‌కృష్ణారెడ్డి లాంటి వారు రాజీనామాలు…హెచ్చ‌రిక‌లు చేశారు . వీరితో పాటు చాలామంది చంద్రబాబుపై తిరుగుబాటు చేసినంత పనిచేశారు. ఇక ప‌ద‌వులు పోయిన వారు బ‌హిరంగంగా విమ‌ర్శించ‌క‌పోయినా లోలోప‌ల మాత్రం తిట్టుకున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వీటికితోడు నాని వ్య‌వ‌హారం కూడా బాబుకు త‌ల‌నొప్పిగా మారంది.ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ బాబుతో భేటీ అయిన‌ప్ప‌టినుంచి కేశ‌నేని నాని గుర్రుగా ఉన్నారు. 

దీనికి తోడు నంద్యాల ఉప ఎన్నిక బాబుకు త‌ల‌నొప్పిగా మారింది.  టికెట్‌కోసం కుమ్ములాట‌లు తారాస్తాయికి చేరాయి.మాజీ మంత్రి ప‌రూక్ అబ్దుల్లా, శిల్పామొహ‌న్ రెడ్డి లాంటి నాయ‌కులు  పార్టీపై దిక్కార స్వ‌రాన్ని వినిపించారు. భూమానాగిరెడ్డి మృతితో కాలీ అయిన నంద్యాల నియేజ‌క‌వ‌ర్గ  ఉప ఎన్నిక టీడీపీలో  ఎంత చిచ్చురేపిందో అందిరికీ తెలిసిందే.  అప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్గ‌తంగా ఉన్న విభేదాలు టికెట్టు కేటాయింపులో ఒక్క సార‌గా బ‌గ్గుమ‌న్నాయి. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి విషయంలో పార్టీలోని లుకలుకలు తారాస్థాయికి చేరాయి. ఈ టికెట్ ను సంపాదించుకునేందుకు ఇప్పటికే నాలుగు వేర్వేరు గ్రూపులు బరిలో ఉన్న సంగతి తెలిసిందే.భూమా కుంటుంబానికి టికెట్టు కేటాయిస్తే క‌ల‌సి ప‌నిచేయ‌మ‌ని  ఖ‌రాకండీగా చెప్పేశారు.

మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించి భంగపడిన వారిలో సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా ఉన్నారు. పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎప్పుడూ పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడలేదని, పార్టీకి ఎంతో అండగా ఉన్నానని.. అయినా పార్టీ అధిష్టానం తమను గుర్తించలేదని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా గుర్తింపు లేదని విమర్శించారు. ఈ క్రమంలో పార్టీ జాతీయ నేత లోకేష్, అధినేత చంద్రబాబు కలగజేసుకుని వ్యక్తిగతంగా మాట్లాడటంతో ధూళిపాళ్ల వెనక్కుతగ్గారు.

పార్టీలో సీనియర్ నేత, కీలక నేతగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన కూడా పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి ఇన్నేళ్లు సేవ చేసిన సరైన గుర్తింపు లభించడం లేదని అన్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయారని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత గోరంట్లకు కూడా అధిష్టానం నుంచి బుజ్జగింపులు వచ్చాయి. ఇ జ‌మ్మ‌ల‌మ‌డుగు నియేజ‌క వ‌ర్గంలో చూసుకుంటే వైసీపీనుంచి టీడీపీలోకి వ‌చ్చిన అదినారాయ‌ణ‌రెడ్డి మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డంతో రామ‌సుబ్బారెడ్డి త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు.మంత్రిగా అవ‌కాశం ఇస్తే నాదారినేను చూసుకంటాన‌ని దిక్కార స్వ‌రం వినిపించ‌పారు.

కానీ ఇంతలోనే  తాజాగా సొంత జిల్లాకు చెందిన ఎంపీ శివప్రసాద్ నుంచి ఈసారి నిరసన గళం మొదలైంది. ఆయన వ్యక్తిగత అంశాలు కాకుండా ఏకంగా దళిత ప్రజలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలంటూ నిలదీస్తుండడంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు.  అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తెలుగుదేశం ప్రభుత్వం దళితులను విస్మరిస్తున్నదంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. దళితులను విస్మరిస్తే సహించబోనంటూ నిరసన గళం వినిపించిన ఆయన ఈ రోజు కూడా అదే వైఖరిని కొనసాగించారు. శివప్రసాద్ నిన్న చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో ఆగ్రహం వ్యక్తం చేసి సీరియస్ అయిన సంగతి తెలిసిందే.  ఆ తరువాత కూడా ఎంపీ శివప్రసాద్ వైఖరిలో మార్పు రాలేదు.  ఈ రోజు  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూడా ఆయన అదే ధిక్కార ధోరణిని వ్యక్తం చేశారు. దళితులను విస్మరిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఉన్న మాటే మాట్లాడాననీ తప్పేం చేయలేదని అన్నారు. దీంతో  శివ‌ప్ర‌సాద్‌పై చ‌ర్చ‌లు తీసుకొనేందుకు బాబు సిద్దంమ‌య్యార‌నీ పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఖ‌టిన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే పార్టీలో మ‌రింత మంది దిక్కార స్వ‌రం వినిపించే అవ‌కాశం ఉంద‌నీ అందుకే బాబు దిక్కార స్వారాల‌పై సీరియ‌స్‌గా ఉన్నార‌నీ ….ఎవ‌రినీ ఉపేక్షించేది లేద‌నీ  సంకేతాలుమ ఇప్ప‌టికే పింపిన‌ట్లు తెలుస్తోంది.

కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడూ లేనంత‌గా ప్ర‌తీ ఒక్క‌రూ ధిక్కార స్వ‌రాలు వినిపిస్తున్నార‌నీ …ఇక ఉపేక్షించేదిలేద‌నీ వారంద‌రిపై చ‌ర్య‌లు ఉంటాయ‌నీ హెచ్చ‌రించారు.ఇవ‌న్నీ చూసుఉంటే పార్టీ స్టీరింగ్ పై  బాబుకు  కంట్రోల్ తప్పుతున్నట్లుగా కనిపిస్తోంది.

Also Read

  1. బాబుతో స‌మావేశ‌మైన మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి  
  2. ర‌స‌వ‌త్త‌రంగా మారిన బెజ‌వాడ రాజ‌కీయాలు
  3. అయేమంలో శిల్పా మొహ‌న్‌రెడ్డి..వైసీపీలోకి మారే యేజ‌న‌
  4. చిత్తూరు జిల్లాలో టీడీపీకీ మ‌రోషాక్‌… వైసీపీ వైపు ఎంపీ శివ‌ప్ర‌సాద్ చూపు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -