Tuesday, April 30, 2024
- Advertisement -

ఐటీ దాడుల్లో బ‌య‌ట‌ప‌డ్డ చంద్ర‌బాబు కుటుంబ ఆస్తులు

- Advertisement -

తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్టు ఉంది.. ఏపీలో ఐటీ అధికారుల సోదాలు. సంధ్య రియ‌ల్ట‌ర్స్‌, సంధ్య హాస్పిట‌ల్స్‌పై ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు కుటుంబసభ్యుల ఆస్తుల లావాదేవీల పత్రాలు బయటపడ్డాయి. నారా బ్రహ్మణి, నారా భువనేశ్వరి పేరున ఉన్న ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు అధికారుల త‌నిఖీల్లో బ‌య‌ట‌ప‌డ్డాయి. దీనికి సంబంధించి అధికారులు ఓ కంపెనీ ప్ర‌తినిధుల‌ను విచారించారు.

గడిచిన రెండేళ్లలో సంధ్య రియల్ ఎస్టేట్ కంపెనీ 500 కోట్ల వరకు వ్యాపారం చేసింది. అయితే అమ్మకాల ద్వారా వచ్చిన లాభాలను ఐటీ రిటన్స్‌లో చూపకుండా ఎగ్గొట్టారు. ఈ అంశాల‌పై నిజాలేంటో నిగ్గు తేల్చ‌డానికి ఐటీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించ‌గా… పంజాగుట్టలో నారా భువనేశ్వరికి చెందిన ఏడు కోట్ల విలువైన ఆస్తికి సంబంధించిన లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి.

అయితే ఎప్పుడూ టెలికాన్ఫ‌రెన్స్‌ల్లో ప‌లు అంశాల‌పై స్పందించే సీఎం చంద్ర‌బాబు ఈ సారి దీనిపై స్పందించ‌లేదు.. ఆ ఛాన్స్‌ను ఈ సారి టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు అందుకున్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అని ఆరోపించారు. ఐటీ దాడుల్లో దొరికిన పత్రాలు వాస్తవమేనని… అవన్నీ చట్టబద్దంగా జరిగిన లావాదేవీలేనని స్పష్టం చేశారు. పంజాగుట్ట ఆస్తికి సంబంధించి బయటపడ్డ పత్రాలన్నీ అసలైనవేనని… అవన్నీ చట్టబద్దమైనవేనన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -