Saturday, May 18, 2024
- Advertisement -

క‌త్తిమ‌హేష్ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ‌

- Advertisement -

సినీ క్రిటిక్ క‌త్తిమ‌హేష్ పై హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. క‌త్తిమ‌హేష్ శాంతి బద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిస్తున్నారంటూ అత‌డిని అరెస్ట్ చేసిన హైద‌రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు న‌గ‌రం బ‌య‌ట వ‌దిలిపెట్టారు. త‌మ అనుమ‌తి లేనిదే న‌గ‌రంలోకి అడుగుపెట్ట‌వద్దంటూ సూచించారు పోలీసులు. ఇటీవ‌లే ఆయ‌న కొంద‌రి గురించి చేసిన వ్యాఖ్య‌లు కొంద‌రి మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయి. ప‌లు స్టేష‌న్ల‌లో కేసులు న‌మోదు అయ్యాయి. ఆయ‌న్ని న‌గ‌రం నుంచి బ‌హిష్క‌రించాలంటూ మాజీ అధికారులు, మ‌త పెద్ద‌లు డిమాండ్ చేశారు. దీంతో న‌గ‌ర పోలీసులు బ‌హిష్క‌ర‌ణ‌కు నిర్ణ‌యం తీసుకున్నారు.

కొద్దిరోజుల క్రితం క‌త్తిమ‌హేష్ ఓ ఛాన‌ల్ డిబేట్లో హిందూ దేవుళ్ల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రాలు వెల్లువెత్తాయి. రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటాన‌ని కామెంట్ చేశారు

దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో క‌త్తిమ‌హేష్ పై కేసులు న‌మోదు అయ్యాయి. బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు అంద‌డంతో క‌త్తి మ‌హేష్ ను పిలిపించి ప్ర‌శ్నించారు. విచార‌ణ‌లో భాగా తాము పిలిచిన‌ప్పుడు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని సూచించారు.

ఈ నేప‌థ్యంలో క‌త్తిమ‌హేష్ బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన క‌త్తిమ‌హేష్ డిబెట్ లో తాను మాట్లాడిన మాట‌ల‌కు అర్ధం తెలియ‌క నేనేదో భూతు మాట్లాడాన‌ని కేసులు పెట్టిన‌ట్లు చెప్పారు.

విచార‌ణ‌లో దగుల్భాజీ అనే ప‌దాన్ని ఎందుకు వాడ‌ర‌ని ప్ర‌శ్నించ‌డంతో..తాను ద‌గుల్భాజి అంటే భూతుప‌దం కాద‌ని మోస‌గాడని అర్ధం అని అన్నారు. రాముడు అనే దేవుడ్ని కించ‌ప‌ర‌చ‌డం నా ఉద్దేశం కాదు. రామాయ‌ణాన్ని న‌మ్మేవారికి అది మ‌త‌గ్రందం. న‌మ్మ‌ని వాళ్లకు అదొక కావ్యం, గ్రందం. ఆ గ్రందంలో రాముడి అభిప్రాయం చెప్పానే త‌ప్పా రాముణ్ని కించ‌ప‌రిచేలా మాట్లాడ‌లేదు. రాముణ్ని పూజించేవాళ్ల‌ను నేనెప్పుడు కించ‌ప‌ర‌చ‌లేదు. కాక‌పోతే నేను మాట్లాడిన మాట‌లపై కించ‌ప‌రిచార‌ని కేసుపెట్టారే త‌ప్ప అందులో ఇంకేం లేద‌ని తెలిపారు.

అయితే కత్తి మహేశ్ శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దానిపై హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్త చేయడంతో న‌గ‌ర పోలీసులు క‌త్తిమ‌హేష్ ను న‌గ‌రం నుంచి బ‌హిష్క‌రిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

శ్రీరాముడిపై కత్తి మహేశ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి ఈరోజు చౌటుప్పల్‌ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. దీనిపై హిందువులదంరూ మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. కానీ ఈ పాద‌యాత్ర‌కు పోలీసులు ప‌ర్మీష‌న్ ఇవ్వ‌లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -