Sunday, May 19, 2024
- Advertisement -

తెలంగాణాలో ముగిసిన గవర్నర్ నరశింహన్ పదవీ కాలం.. ఘనంగా వీడ్కోలు…

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా, అనంతరం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా మొత్తం 9 ఏళ్ల 9 నెలల పాటు కొనసాగిన నరసింహన్ పదవీకాలం ముగిసంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు సుదీర్ఘకాలం పాటు గవర్నర్ గా సేవలు అందించిన నరసింహన్ కు తెలంగాణా ముఖ్యమంత్రి ఘనంగా వీడ్కోలు పలికారు.

గవర్నర్ దంపతులు రాజ్ భవన్ నుంచి ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ కు వచ్చిన తరువాత అక్కడ ఆయనకు ఘనంగా స్వగతం పలికారు. ఆయన్ను ఘనంగా సన్మానించారు. గవర్నర్ గా చేసిన సేవలను గురించి కొనియాడారు. అనంతరం గవర్నర్ దంపతులు రాజ్ భవన్ వెళ్లి అక్కడి నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.

బేగంపేట విమానాశ్రయంలో నరసింహన్ దంపతులకు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.ఎయిర్‌పోర్టులో నరసింహన్‌ పోలీసుల నుంచి వీడ్కోలు గౌరవవందనం స్వీకరించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ నరసింహన్ దంపతులు సొంత రాష్ట్ర మైన తమిళనాడుకు బయలు దేరి వెల్లారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -