Sunday, May 19, 2024
- Advertisement -

కొందరికి మాత్రమే కొవిడ్‌-19 టీకా … ఆరోగ్య శాఖ..!

- Advertisement -

దేశంలో కొవిడ్‌-19 టీకా వేసుకోవడం ఐచ్ఛికమేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడం తప్పనిసరి కాదని వెల్లడించింది. దేశంలోకి రాబోయే టీకా.. ఇతర దేశాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల కంటే సమర్థంగా పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేసింది.కరోనా సోకిందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా అందరూ కరోనా టీకా పూర్తిస్థాయిలో తీసుకోవడం మంచిదని అభిప్రాయపడింది ఆరోగ్య శాఖ. తద్వారా శరీరంలో కరోనాను ఎదుర్కోగల రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపింది.

టీకా రెండో డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాత.. రక్షణ వ్యవస్థ బలోపేతం అవడం సాధారణంగా జరిగే ప్రక్రియ అని ఆరోగ్యశాఖ వివరించింది. దేశంలో కరోనా టీకా ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నాయని.. త్వరలోనే ఓ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.ప్రస్తుతం ఆరు వ్యాక్సిన్లకు భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నట్లు తెలిపింది ఆరోగ్య శాఖ. ఈ వ్యాక్సిన్‌ల పనితీరు, దుష్ప్రభావాలపై తరచూ అడిగిన ప్రశ్నల జాబితాను తాజాగా విడుదల చేసింది. టీకాల భద్రత, పనితీరు ఆధారంగా.. సంబంధిత నియంత్రణ సంస్థలు వాటికి అనుమతులు ఇస్తాయని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -