Saturday, May 18, 2024
- Advertisement -

ATM లో రెండు కార్డులు వాడాడు అని చెయ్యి విరక్కోట్టేసిన పోలీసు

- Advertisement -
Customer hand broken by Head constable at ATM in Andhra pradesh

నోట్లు తీసుకోవడం కోసం ఏటీఎం లకి వెళుతున్న వారు గంటలు గంటలు క్యూ లలో నుంచోవడం సాధారణ విషయం అయిపొయింది. గంటల సేపు క్యూలలో నిలబడినా కూడా డబ్బులు వస్తాయో లేదో గ్యారెంటీ లేదు. ఏటీఎం ల దగ్గర ఒక్కొక్కరూ తమదగ్గర ఉన్న మూడు నాలుగు కార్డులని వినియోగిస్తూ వచ్చినంత సొమ్ము బయటకి లాగేస్తున్నారు.

దీంతో వెనకాల ఉన్న వారు అసహనం తో ఉండి గొడవ చేస్తున్నారు. ఏటీఎం దగ్గర క్యూలో ఉన్న సుధాకర్ అనే వ్యక్తి తన వంతు రాగానే లోపలి వెళ్ళాడు. రెండు కార్డులతో డబ్బును డ్రా చేశాడు. దీంతో, అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజా హుసేన్ అతడిని అడ్డుకున్నాడు. నువ్వొక్కడివే రెండు కార్డులు వినియోగిస్తే… వెనకున్న వారికి డబ్బులు వద్దా? అని ప్రశ్నించాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహం పట్టలేని కానిస్టేబుల్ హుసేన్… సుధాకర్ చెయ్యి పట్టుకుని తిప్పాడు. దీంతో, అతని చెయ్యి విరిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం జిల్లా ఎస్పీకి చేరడంతో… హుసేన్ ను వీఆర్ కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -