- Advertisement -

అమ్మాయిల స్క‌ర్ట్ కింద 24 కేజీల దొంగ బంగారం…..

- Advertisement -

బంగారం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. స్మ‌గ్లింగ్‌ను ఎంత అరిక‌ట్టాల‌ని అధికార‌లు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌డంలేదు. స్మ‌గ్ల‌ర్లు కొత్త దారుల‌ను వెతుక్కుంటున్నారు. తాజాగా చెన్నైలో ఎయిర్ పోర్ట్‌లో ఇద్ద‌రు అమ్మాయిల‌ను భారీగా దొంగ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని స్మ‌గుల్ చేసిన విధానం చూసి అధికారుల మైండ్ బ్లాక్ అయ్యింది. ర్టులోపల లోదుస్తుల్లో వీరు ఏకంగా 24 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది.

కొరియాకు చెందిన 26 ఏళ్ల హాంబియోల్‌ జంగ్‌, యూయంగ్‌ కిమ్‌ హాంకాంగ్‌ నుంచి విమానంలో చెన్నై వచ్చారు. వీరు కాస్త తేడాగా నడుస్తుంటంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. పక్కకు తీసుకెళ్లి తనిఖీ చేస్తే కస్టమ్స్ అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. బంగారు బిస్కెట్ల‌ను లోదుస్తులు, స్కర్టులోపల ఏకంగా 24 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ దొరికి పోయారు.ఒక్కోక్కటి కేజీ బరువున్న 24 బిస్కట్లను అధికారులు గుర్తించారు. ఒక్కొక్కరు చెరో 12 బిస్కట్లను దుస్తుల్లో దాచారట. ఈ మొత్తం స్మగ్లింగ్ బంగారం విలువల 8 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -