Sunday, May 19, 2024
- Advertisement -

యూట్యూబ్ ఛానల్ పెట్టి… 170కోట్లు కొట్టేశాడు..

- Advertisement -

చాలామంది కుర్రాళ్లు నెలగడవడం కోసం కొలువులు చేస్తుంటారు. ఇంకొందరు తమకున్న టాలెంట్ కు పదును పెట్టి సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ చూసుకుంటారు. అలాంటివారిలోకి ఈ బ్రిటీష్ యువకుడు కూడా వచ్చి చేరిపోయాడు. టెక్నాలజీని వాడుకుని సంపద ఎలా సృష్టించుకోవచ్చో.. జనాలకు తెలియజేస్తున్నాడు. ఈ బ్రిటిష్‌ యువకుడు యూట్యూబ్‌ ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదించి న్యూస్ మేకర్ అయ్యాడు. అదికూడా అల్లాటప్పా ఎమౌంట్ కాదండోయ్ . ఏకంగా 170 కోట్లు తన ఖాతాలో వేసేసుకున్నాడు.

విషయంలోకి వెళదాం. బ్రిటన్‌కు లోని గ్రాసరీ స్టోర్….. టెస్కోలో చాలా కాలం పాటు పనిచేసిన డాన్‌ మిడిల్టన్ అనే యువకుడు ఉద్యోగానికి రాజీనామా చేసి, టీడీఎం పేరిట యూట్యూబ్ లో ఛానెల్‌ను ఏర్పాటు చేశాడు. ఈఛానెల్‌లో వీడియో గేమ్‌లను ఎలా ఆడాలి, కొత్త గేమ్‌లపై రివ్యూలు రాయడం…వాటికి చెందిన సలహాలు ఉచితంగా అందించేవాడు. దీనివలన మిడిల్టన్‌ ఛానెల్‌కు సుమారు 16 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లుగా వచ్చిపడ్డారు.ఇలా చేయడం వలన అతగాడి వీడియోలకు భారీ సంఖ్యలో హిట్స్‌ వచ్చాయి. అంతే కాదు యూట్యూబ్‌ నుంచి ఏకంగా 16.5 మిలియన్ డాలర్లు (రూ.170 కోట్లు) సొమ్ము వచ్చిపడింది. ఈ సంపాదనతో మిడిల్టన్‌ ఫోర్బ్స్ పత్రికలో ‘ద హయ్యెస్ట్ పెయిడ్ యూట్యూట్ స్టార్-2017’ గా రికార్డులకెక్కాడు.

ఓవరాల్ గా యూట్యూబ్ స్టార్‌లుగా పేరొందిన మొదటి పదిమందికి వచ్చిన అమౌంట్ …. 188 కోట్లు ఉంటే… అందులో డాన్ వాటానే దాదాపు 170 కోట్లని తెలిసింది.ఈ వార్త ఇపుడు ఎందరో యూట్యూమ్ ప్రియులను టెంప్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది …అందరూ మిడిల్టన్ అంతలా సక్సెస్ అవుతారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. దేనికైనా టైమ్ రావాలంటారు.అయితే ఇందులో మన ప్రయత్న లోపం ఉండకూడదు.
డాన్ మిడిల్టన్ …యూ ట్యూబ్ ఛానల్ మీరు చూడాలనుకుంటే ఇదిగో లింక్ . చూసేయండి.

https://www.youtube.com/user/TheDiamondMinecart

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -