Friday, May 17, 2024
- Advertisement -

అతడి సమాచారం ఇవ్వండి.. లక్ష రూపాయలు రివార్డు ఇస్తాం!

- Advertisement -

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు దృష్టిసారించారు. జనవరి 26 కిసాన్ పరేడ్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అంతే కాదు పోలీసులు ఇప్పటివరకు దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద 44 కేసులను నమోదు చేసి, చాలా మందిని అరెస్టు చేశారు.

తాజాగా రిపబ్లిక్​ డే రోజున ఎర్రకోటలో జరిగిన హింసాత్మక ఘటనలతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దీప్ సిద్ధూపై సమాచారం అందిస్తే రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

సిద్దూతో పాటు ఆ ఘటనతో సంబంధమున్నట్లు భావిస్తున్న జగ్రాజ్ సింగ్​, గుర్​జోత్​ సింగ్​, గర్జాంత్ సింగ్​ల ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష బహుమానం ఇస్తామని తెలిపారు. జజ్బీర్ సింగ్​, బుటా సింగ్​, సుఖ్​దేవ్​ సింగ్​, ఇక్బాల్​ సింగ్​లను అరెస్టు చేసేలా సమాచారం ఇచ్చినవారికి రూ.50వేలు రివార్డుగా ఇస్తామని ఢిల్లీలో పోలీసులు చెప్పారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీలో జరిగిన హింసపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎర్రకోట ఘటనకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దీప్ సిద్ధూ సహా పులువురిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు.

రూ. 4 కోట్ల గిఫ్టు ఇచ్చిన హీరోయిన్‌!

షాక్.. వికారాబాద్ లో ‘బర్డ్ ఫ్లూ’ కలకలం.. వందల సంఖ్యల్లో పక్షులు మృతి!

కాబోయే హోంమంత్రిని.. మీ అంతు చూస్తా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -