Friday, April 19, 2024
- Advertisement -

షాక్.. వికారాబాద్ లో ‘బర్డ్ ఫ్లూ’ కలకలం.. వందల సంఖ్యల్లో పక్షులు మృతి!

- Advertisement -

గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ జనాలను ఎంత భయపెడుతుందో అందరికీ తెలిసిందే. బర్డ్ ఫ్లూ కారణంగా ఇప్పటికే కేరళ రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ , హర్యానా, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు ప్రభావితం అయ్యాయి. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయం లేదని చెబుతున్నా తాజాగా బర్డ్ ఫ్లూ గా పిలువబడే ఏవియన్ ఇన్ ఫ్లూఎంజా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతుంది.

ఇక తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని వికారా బాద్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. ఓకే ఊరిలో వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, పిట్టలు మృత్యువాత పడడం ఆ గ్రామ వాసులు అందర్నీ టెన్షన్ పెడుతోంది. ధారూర్ మండలం దోర్నాల్ గ్రామంలో నిన్నటి నుంచి వందల సంఖ్యలో ఇలా కోళ్లు, కాకులు, పిట్టలు వరుసగా మృత్యువాత పడుతున్నాయని అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. కొన్ని శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపినట్లు సమాచారం అందుతోంది. ఏదేమైనా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బర్డ్ ఫ్లూ విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాబోయే హోంమంత్రిని.. మీ అంతు చూస్తా!

అది మ‌రి బ‌న్నీ అంటే.. ఆ మాత్రం ఉంటుందిలే!

అంజీర పండ్లతో చక్కటి ఆరోగ్యం!

అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -