Sunday, May 19, 2024
- Advertisement -

ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ‌

- Advertisement -
high court orders status quo on penumaka land acquisition notification

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రాజధాని గ్రామాల్లో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు చంద్రబాబు సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది.పెనుమాక భూసేకరణ నోటిఫికేషన్‌ పై స్టేటస్‌ కో విధించింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అన్నదాతల అభ్యంతరాలను పరిష్కరించాకే ముందుకెళ్లాలని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది.

ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే వేలాది ఎకరాల్ని రైతుల నుంచి సేకరించిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు మరికొన్ని గ్రామాల మీద కూడా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన 660.83 ఎకరాల్ని ప్రభుత్వం సేకరించేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తమ భూముల్ని ఇచ్చేందుకు ఇక్కడి రైతులు ససేమిరా అన్న నేపథ్యంలో.. వారి నుంచి భూమి సేకరించేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేశారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారించిన హైకోర్టు.. ఏపీ సర్కారుకు షాకిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. భూములు తీసుకునే ప్రయత్నాలకు చెక్ చెబుతూ.. పెనుమాక భూసేకరణ నోటిఫికేషన్ పై స్టేటస్ కో ను విధించింది. రైతుల అభ్యంతరాలను పరిష్కరించాకే ముందుకు సాగాలని… అంతవరకు యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. 

కాగా తమ భూములను తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ పై  స్టేటస్ కో విధించటంపై పెనుమాక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు ఇచ్చేందుకు ఇష్టపడకపోవడంతో ప్రభుత్వం బలప్రయోగం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు . హైకోర్టు తాజా నిర్ణయం ఏపీ సర్కారుకు తాజా పరిణామం ఇబ్బంది కలిగించేదని చెప్పక తప్పదు. 

తమ తరపున పోరాడుతున్నందుకు వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ తీర్మానాలు చేసినా పట్టించుకోకుండా భూములు లాక్కునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని మ‌రో సారి పునరుద్ఘాటించారు.

Related

  1. లోకేష్‌తో టీడీపీ సంక‌నాక‌డం ఖాయం…..అయేమ‌యంలో చంద్ర‌బాబు
  2. కార్ల‌పై ఎర్ర‌బుగ్గ‌ను వినియేగించ‌కుండా మార్గ‌ద‌ర్శ‌ కాలు జారీ చేసిన కేంద్రం
  3. బాబ్రి విధ్వంసం కేసులో  బీజేపీ  అగ్ర‌నేత‌ల‌పై కుట్ర జ‌రుగుతోంది
  4. టీడీపీకి మరో షాక్.. అనంతలో వైసీపీకి 2019లో విజయం ఖాయం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -