Sunday, May 19, 2024
- Advertisement -

చంద్రభాన్ కు మరణశిక్ష

- Advertisement -

క్యాబ్ డ్రైవర్ గా నమ్మించాడు. హాస్టల్ దగ్గర దిగబెడతానని మాయ మాటలు చెప్పాడు. నమ్మి వచ్చిన ఆ అబలను.. దారుణంగా అత్యాచారం చేసి.. ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆంధ్రా అమ్మాయి అనూహ్యను.. ముంబైలో ఇంత అరచకంగా అంతమొందించిన వ్యక్తి చంద్రభాన్.. ఇప్పుడు ఉరికంబం ఎక్కబోతున్నాడు. చేసిన పాపానికి ఇంత కాలానికి శిక్ష ఎదుర్కోబోతున్నాడు. విచారణలో నేరం రుజువవడంతో.. ముంబై ప్రత్యేక కోర్టు చంద్రభాన్ కు మరణశిక్ష విధించింది. 

2014 జనవరి 4న.. విజయవాడ నుంచి లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో అనూహ్య ముంబై బయల్దేరింది. ఆ తెల్లారి రైల్వే స్టేషన్ లో దిగిన అనూహ్యకు చంద్రభాను ఎదురయ్యాడు. తానో క్యాబ్ డ్రైవర్ అని నమ్మించి హాస్టల్ దగ్గర దిగబెడతానని తీసుకెళ్లాడు. స్టేషన్ బయట అనూహ్యను బెదిరించి బైక్ పై తీసుకెళ్లిన చంద్రభాన్.. కొంత దూరం వెళ్లాక ఎవరూ లేని ప్రదేశంలో అత్యాచారానికి ఒడిగట్టాడు. తనను విడిచిపెట్టాలని.. రెండు లక్షల రూపాయల వరకూ ఇస్తానని అనూహ్య వేడుకున్నా.. చంద్రభాన్ మనసు కరగలేదు. పాశవికంగా అత్యాచారం చేసిన తర్వాత.. అనూహ్య ను గొంతునులిమి చంపేశాడు. అక్కడితో ఆగకుండా.. పెట్రోల్ పోసి తగలబెట్టి తగలబెట్టాడు. ఇది జరిగిన 11రోజుల తర్వాత ముంబై పోలీసులు అనూహ్య మృతదేహం కనుగొన్నారు. ఆమె ఏపీ నుంచి వచ్చిన విషయం తెలుసుకుని ముంబై ఎల్ టీటీ రైల్వే స్టేషన్ లో కూపీ లాగారు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. చంద్రభాన్ పై అనుమానంతో ఆరాతీశారు. మరోవైపు.. హత్య చేసిన తర్వాత ముంబై నుంచి పారిపోయి నాసిక్ లో మారు వేశంలో చంద్రభాన్ తిరగడం మొదలు పెట్టాడు. చివరికి తన కుటుంబీకులను కలుసుకునేందుకు మళ్లీ ముంబై వచ్చినపుడు పోలీసులు పసిగట్టేశారు. అదుపులోకి తీసుకుని వారి స్టైల్లో విచారించగానే.. చంద్రభాన్ నేరం ఒప్పుకున్నాడు. ఇదంతా జరిగిన తర్వాత.. చంద్రభాన్ కు శిక్ష ఖరారు చేయడంలో ముంబై ప్రత్యేక కోర్టు ఒకటికి రెండు సార్లు ఆలోచించింది. చివరికి బాధితుల వెర్షన్ తో పాటు.. లాయర్ల వాదనతో ఏకీభవిస్తూ.. చంద్రభాన్ కు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ తీర్పుతో అనూహ్య తల్లిదండ్రులు, కుటుంబీకులు కాస్త ఊరట పొందారు.

క్షణికావేశానికి పోయి.. చివరికి మరణశిక్ష ఎదుర్కోబోతున్న చంద్రభాన్ వ్యవహారం.. దేశంలో కనీసం ఒక్క కామాంధుడిని మార్చినా మంచిదే కదా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -