Wednesday, May 15, 2024
- Advertisement -

నేడు రహదారులు బంద్..!

- Advertisement -

చట్టాలను రద్దు చేయాలన్న డిమాండుపై రైతులు వెనక్కి తగ్గడం లేదు. వారి ఆందోళనలకు మద్దతు పెరుగుతోంది. అమృత్​సర్​లోని కిసాన్ మజ్దూర్​ సంఘర్ష్​ కమిటీ సభ్యులు 700 ట్రాక్టర్లతో ఢిల్లీ కి బయల్దేరారు. కుండ్లి సరిహద్దులో ఆందోళనలు చేపట్టనున్నారు. శనివారం ఢిల్లీ-జైపుర్, ఢిల్లీ- ఆగ్రా రహదారులను దిగ్బంధిస్తామని రైతు నాయకులు తెలిపారు. టోల్​ గేట్ల వద్ద రుసుం కట్టకుండా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.

చర్చలపై ప్రభుత్వానికి ఆసక్తి ఉంటే మునుపటిలాగానే ఆహ్వానిస్తూ లేఖ పంపిచాలని భారతీయ కిసాన్​ నాయకడు రాకేశ్​ తికాయత్​ తెలిపారు. దీనిపై అన్ని సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశ తేదీని, స్థలాన్ని ప్రభుత్వమే ముందుగా చెప్పాల్సి ఉందన్నారు. చట్టాలను రద్దు చేయడం తప్ప, మరిదేనినీ రైతులు అంగీకరించబోరని చెప్పారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిసారీ చర్చలకు రైతులు సుముఖత వ్యక్తం చేశారని అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ సమితి గుర్తుచేసింది. ప్రభుత్వమే మొండి వైఖరితో వ్యవహరిస్తోందని ఆల్​ ఇండియా కిసాన్​ సభ ఆరోపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -