Friday, April 26, 2024
- Advertisement -

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

- Advertisement -

తెలంగాణలో గత కొంత కాలంగా ఉత్కంఠ రేపుతున్న ధాన్యం కొనుగోలు వ్యహారానికి సీఎం కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని తామే కొంటామని స్పష్టం చేశారు. సీఎం అధ్యక్షతన మంగళవారం ప్రగతి భవన్ లో జరిగి కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు.

సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కింటాల్ కు 19 వందల60 రూపాయల మద్దతు ధరతో ధాన్యం కొంటామని ప్రకటించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామన్నారు. వరి కొనుగోళ్ల విషయంలో చేతులెత్తేసిందంటూ మండిపడ్డారు. ధాన్యం సేకరణలో కేంద్రానిది వింతడ వాదమన్నారు. దేశంలోని వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందంటూ కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలను నూకలు తినమంటారా అంటూ ప్రశ్నించారు. కేంద్రంలో దిక్కుమాలిన, దరిద్రపు ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.

కేంద్రం పన్నులు పెంచి రాష్ట్రాలను వ్యాట్ తగ్గించమంటోందన్నారు. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ బీజేపీ డ్రామాలు చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. పీయూష్ గోయల్ కు బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. ధాన్యం కొనడానికి కేంద్రం దగ్గర డబ్బులు లేవా లేక మోదీకి మనసు లేదా అని ప్రశ్నించారు.

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అల్టిమేటం

టీఆర్‌ఎస్‌కు పోటీగా బీజేపీ రైతు సభ

కేబినెట్ పదవుల చిచ్చు చల్లార్చడంపై జగన్ దృష్టి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -