Sunday, May 5, 2024
- Advertisement -

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఈ రెండు సంవత్సరాల ఫలితాల్లోనూ కూడా బాలికలదే పైచేయి. బాలురతో పోలిస్తే బాలికలే ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

అలాగే రెండు సంవత్సరాల ఫలితాల్లోనూ కూడా రంగారెడ్డి జిల్లాకే ప్రధమ స్ధానం రావడం విశేషం. ఫస్టియర్ ఫలితాల్లో 69 శాతం, సెకండియర్ ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణత సాధించి రంగారెడ్డి జిల్లా ప్రధమ స్ధానం సాధించింది. ఇక ఫస్టియర్ ఫలితాల్లో 56 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్ రెండో స్ధానం, సెకండియర్ ఫలితాల్లో 66 శాతంతో ఖమ్మం జిల్లా రెండో స్ధానాన్ని కైవసం చేసుకున్నాయి.

ఇంటర్ ఫస్టియర్లో 59 శాతం బాలికలు పాసైతే, బాలురు 48 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇక సెకండియర్ లో మొత్తం 62.70 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణలవ్వగా అందులో  బాలికలు 67 శాతం, బాలురు 58 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో నల్గొండ జిల్లా, సెండియర్ లో మెదక్ జిల్లా చివరి స్ధానాలు సాధించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -