Sunday, May 19, 2024
- Advertisement -

ఎపి ప్రభుత్వ నిర్ణయం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో పని చేసేందుకు వెళ్లే ఉద్యోగులు ఇక నుంచి వారానికి ఐదు రోజులే పని చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులు, అధికారులు వారానికి ఐదు రోజుల పని దినాలు మాత్రమే వర్తింపజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ నుంచి వెలగపూడి వెళ్లే ఉద్యోగులందరికి ఇది వర్తిస్తుంది. హైదరాబాద్ లో పని చేస్తున్న ఉద్యోగులను జూన్ 27 నాటికి నూతన రాజధానికి తరలించాలని నిర్ణయించారు. ఇంతకు ముందు వీరిని మూడు దశల్లో తీసుకువెళ్లాలనుకున్నారు.

వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో కార్యదర్శులు, మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయాలను మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఇక మిగిలిన విభాగాల ఉద్యోగులు, విభాగాధిపతుల కార్యాలయాలను విజయవాడ, గుంటూరు  నగరాల్లో జూన్ 27 వ తేది నాటికి ఏర్పాటు చేయాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -