Saturday, May 18, 2024
- Advertisement -

ఓయూను చూసి భ‌య‌ప‌డుతున్న మోదీ, కేసీఆర్‌

- Advertisement -
  • ఓయూను చూసి భ‌య‌ప‌డుతున్న మోదీ, కేసీఆర్‌
  • జాతీయ సైన్స్ కాంగ్రెస్ వేదిక మార్చే యోచ‌న‌లో ప్ర‌భుత‌్వం

ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం పోరాటాల‌కే కాదు విద్యావంతుల‌ను త‌యారుచేసిన స‌ర‌స్వ‌తీ నిల‌యం. ఈ ఓయూను చూసి కేంద్ర‌లోని మోదీ ప్ర‌భుత్వం, తెలంగాణ‌లోని కేసీఆర్ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంది. అందుకే ఓయూలో నిర్వ‌హించాల్సిన 105వ భార‌త సైన్స్ కాంగ్రెస్‌ను వేరోచోట నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కాంగ్రెస్‌ను హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వ‌హించాల్సిన చూస్తున్నారు. ఈ మేర‌కు అధికారులు సాధ్యసాధ్యాలు ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. దీనిపై కేంద్రానికి రాష్ట్ర‌ ప్ర‌భుత్వం లేఖ కూడా రాసింద‌ట‌. భార‌త సైన్స్ కాంగ్రెస్ 2018 జ‌వ‌న‌రి 3-7 తేదీల‌లో నిర్వ‌హించాల‌ని గ‌తేడాదే నిర్ణ‌యం తీసుకున్నారు.

ఓయూ అంటే మొద‌టి నుంచి కేసీఆర్‌కు భ‌య‌మే. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఏనాడూ ఓయూ గేట్ వ‌ర‌కు రానీ కేసీఆర్ కానీ విద్యార్థుల‌ను త‌న ఉద్య‌మానికి ఊపిరిగా మ‌లుచుకున్నాడు. ఆ త‌ర్వాత ఒక్క‌నాడు కూడా ఓయూలోకి అడుగుపెట్టలేదు. 2017 ఏప్రిల్‌లో 26వ తేదీన‌ ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం శ‌త వ‌సంతాల ఉత్స‌వాల సంద‌ర్భంగా అప్ప‌టి రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీతో హాజ‌రైన కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడ‌కుండా ఓయూ నుంచి వెళ్లిపోయాడు. అస‌లే ర‌గులుతున్న విద్యార్థుల‌కు కేసీఆర్ మాట్లాడ‌క‌పోవ‌డం మరీ మండిప‌డుతున్నారు. ఇప్పుడు ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌లు ఒక్క‌టీ వేయ‌కపోవ‌డం.. ఓయూ శ‌త వ‌సంతాల వేడుక‌కు స‌క్ర‌మంగా నిధులు ఇవ్వ‌క‌పోవ‌డం, బ‌య‌ట ఆర్బాటంగా ఏర్పాట్లు చేసినా.. హాస్ట‌ల్స్, రూమ్స్ త‌దిత‌ర ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో విద్యార్థులు స‌భ‌లోనే ఆందోళ‌న చేశారు. పైగా మొన్న ఎమ్మెస్సీ విద్యార్థి ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లు రాలేద‌ని ఆందోళ‌న చెందుతూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న నేప‌థ్యంలో ఆందోళ‌న‌లు చెల‌రేగాయి. అవి ఇంకా తెర‌ప‌డలేదు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం ముందస్తు జాగ్ర‌త్తగా స‌మావేశాల‌ను వేరే చోట నిర్వ‌హించాల‌ని చూస్తున్నారు. పైగా ఈ స‌ద‌స్సు నేప‌థ్యంలో ఓ నెల ముందుగా

మోదీ ప్ర‌భుత్వానిది అదే..
రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య చోటుచేసుకున్న‌ప్ప‌టి నుంచి బీజేపీ కూట‌మి ప్ర‌భుత్వానికి విశ్వ‌విద్యాల‌యాలు వ్య‌తిరేకంగా మారాయి. అప్ప‌టి నుంచి విద్యార్థులు ప్ర‌ధాని మోదీ ప‌రిపాల‌న‌ను అంగీక‌రించ‌డం లేదు. రోహిత్ ఆత్మ‌హ‌త్య దేశాన్ని కుదిపేసింది. అందుకే ఇప్పుడు ఎక్క‌డా విశ్వ‌విద్యాల‌యాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నా బీజేపీ అనుబంధ సంఘాలు ఘోర ఓట‌మి చెందుతున్నాయి. బీజేపీ సంఘం ఏబీవీపీ చాలా యూనివ‌ర్సిటీల్లో ఓడిపోయింది. మోదీ ప్ర‌భుత్వం కూడా పెద్ద‌గా ఉద్యోగాలు ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో, విద్యావిధానంలో కొత్త కొత్తవి తీసుకురావ‌డంతో విద్యార్థులు ర‌గులుతున్నారు. పైగా రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య చేసుకున్న హైద‌రాబాద్‌లో స‌భ నిర్వ‌హించ‌డం కొంచెం క‌లిసొచ్చే అంశం కాదు. వీట‌న్నిటి నేప‌థ్యంలో భార‌త సైన్స్ కాంగ్రెస్ స‌మావేశాల‌ను మ‌రోచోట హైద‌రాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వ‌హించాల‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఈ విధంగా కేంద్ర‌, రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు విశ్వ‌విద్యాల‌యాలంటే భ‌యం ప‌ట్టుకుంద‌ని నిరూపిత‌మ‌వుతోంది. ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లు వేయ‌క‌పోవ‌డం, విద్యాభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో త‌దిత‌ర కార‌ణాలతో విద్యార్థులు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలపై ఆగ్ర‌హంగా ఉన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -