Sunday, May 19, 2024
- Advertisement -

సాగునీరు అందించడమే లక్ష్యం : గవర్నర్‌

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం రైతులకు సాగునీటిని అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందని గవర్నర్ నరసింహన్‌ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. 21 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, లక్ష్యాలు, నిర్దేశించుకున్న భవిష్యత్ ప్రాథమ్యాలను గవర్నర్‌ వివరించారు.

మహారాష్ట్రతో సామరస్యపూర్వక వాతావరణంలో ఒప్పందం జరుపుకొని అంతర్రాష్ట్ర సమస్యల్ని విజయవంతంగా పరిష్కరించామని గవర్నర్‌ తెలిపారు. న్నారు. గడచిన 21 నెలల్లో ప్రాథమ్యాలను గుర్తించి..45వేల చెరువుల పునరుద్ధరణకు మిషన్‌ కాకతీయ. మిషన్‌ భగీరథ పేరుతో ఇంటింటికీ తాగునీటిని అందించే పథకం చేపట్టామన్నారు. ఇక పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. 1.15లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించామన్నారు. పేదల ఇళ్లలో.. వివాహ విషయంలో ఆర్థిక సమస్యలు లేకుండా కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. 

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ హామీ నెరవేర్చే ప్రక్రియ ప్రారంభమైందని గవర్నర్‌ తెలిపారు. వ్యవసాయ రంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్‌లో 4 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని నిర్మిస్తున్నామని తెలియజేశారు. గర్భిణుల కోసం ఆరోగ్య లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. అంతరాయం లేని, నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వడం ప్రభుత్వం సాధించిన పెద్ద విజయమన్నారు. సౌర విద్యుత్‌కు రానున్న మూడేళ్లలో భారీగా ప్రోత్సాహం ఇస్తామన్నారు. 

అయితే గవర్నర్‌ ప్రసంగంపై విపక్షాలు పెదవి విరిచాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సాగులో వృద్ధి సాధించామని చెప్పడం సిగ్గుచేటని తెలుగుదేశం శాసనసభాపక్షం నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూ పంపిణి, ముస్లిం, గిరిజనుల 12 శాతం రిజర్వేషన్ల అంశం వంటి కీలక అంశాల ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. ఉచిత విద్య, బీసీ సబ్ ప్లాన్, కరవు నివారణ చర్యలు, ఉద్యోగాల భర్తీ వంటి కీలక అంశాల ఊసేలేదని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. పల్లెల్లో కరవు విలయ తాండవం చేస్తుంటే..ప్రభుత్వం మాత్రం నూతన పారశ్రామిక విధానం, ఇంటింటికి ఇంటర్ నెట్ అంటు కల్లబొల్లి మాటలు చెబుతోందని ధ్వజమెత్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -