Monday, May 20, 2024
- Advertisement -

స‌న్యాసిగా మారిన ఇంట‌ర్ టాప‌ర్ విద్యార్థి

- Advertisement -
Gujarat Class 12 topper Varshil Shah sentational decision

సాధారణంగా పరీక్షల్లో టాపర్‌గా నిలిచే విద్యార్థులు భవిష్యత్‌ కోసం ఎన్నో కలలు కంటారు. ఉన్నత చదువుల కోసం ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చేరేందుకు ప్రయత్నిస్తారు. ఆత‌ర్వాత ఉన్న‌త ఉద్యోగాలు చేయాల‌ని క‌ల‌లు కంటారు.కాని ఇంట‌ర్‌లో టాప‌ర్‌గా నిలిచిన ఓ కుర్రాడు మాత్రం తీసుకున్న అనూహ్య‌నిర్న‌యం అంద‌ర్ని విస్మ‌యానికి గురిచేసింది.

17 ఏళ్ల అహ్మదాబాద్ కుర్రాడు వర్షిల్ షా… గుజరాత్ 12వ తరగతి పరీక్షల్లో 99.99 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు.అయితే వర్షిల్ మాత్రం సన్యాసం స్వీకరించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తన నిర్ణయంపై మీడియాతో మాట్లాడుతూ… ‘‘అత్యధిక మార్కులు సాధించినప్పటికీ… అందరిలాగా భూ సంబంధమైన ఆస్తులు సంపాదించడం నాకిష్టం లేదు. ఆత్మ శాంతి, శాశ్వితమైన ఆనందం సంపాదించడమే నా లక్ష్యం. నా వెనుక ఉన్నవాటిన్నిటినీ వదలేసి, జైన సన్యాసిగా మారినప్పుడే అది సాధ్యం…’’ అని వర్షిల్ పేర్కొన్నాడు.

{loadmodule mod_custom,GA1}

చదువులు పక్కన పెట్టి గురువారం సూరత్‌ పట్టణంలో సన్యాసం స్వీకరించాడు.కళ్యాణ్‌ మహరాజ్‌ అనే జైన సన్యాసిని స్ఫూర్తిగా తీసుకొని షా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరో విశేషం ఏంటంటే, కరెంటు ఉత్పత్తి చేసే ప్రక్రియలో అనేక జలచరాలు చనిపోతాయని భావించి కరెంట్‌ వాడకాన్ని షా కుటుంబం బాగా తగ్గించింది. అందుకే ఇంట్లో టీవీ, రిఫ్రిజిరేటర్‌ వంటి పరికరాలు లేవు. ఆకుటుంబానికి మొద‌టినుంచి ఆధ్యాత్మిక భావాలు ఎక్క‌వ‌ని అక్క‌డి వారు చెప్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -