Monday, May 20, 2024
- Advertisement -

కాల్పుల‌కు గురైన జ‌డ్టీ భార్య మృతి, కొడుకుబ్రెయిన్ డెడ్‌..

- Advertisement -

గురుగ్రామ్‌లో సెషన్స్ జడ్జి భార్యను అతని కుమారుడిని వ్యక్తిగత భద్రతా సిబ్బంది కాల్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో జడ్జి భార్య మృతి చెందగా కొడుకు ధ్రువ్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. హరియాణా పోలీస్‌శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌గా ఉన్న మహిపాల్‌ సింగ్‌ రెండెళ్లుగా అదనపు సెషన్స్‌ జడ్జి కృష్ణకాంత్‌ శర్మ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే చాలా కాలంగా ఇంటికి వెళ్లేందుకు సెలవు ఇవ్వాలని మహిపాల్‌ సింగ్‌ విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదు. దీనికితోడు న్యాయమూర్తితో పాటు ఆయన కుటుంబీకులు మహిపాల్‌ సింగ్‌ను తరచూ దూషించేవారనే కోపంతో సదరు పోలీసు జడ్జి భార్య రీతూ, కొడుకు ధ్రువ్‌లపై శనివారం అర్కాడియా మార్కెట్‌లో కాల్పులకు పాల్పడ్డాడు.

మేదాంత మెడికల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వీరిద్దరూ మరణించినట్టేనని గురుగ్రామ్ పోలీసులు వెల్లడించారు. రీతూ గుండెల్లోకి రెండు బులెట్లు దిగాయని, తీవ్రమైన రక్తస్రావం ఆమె ప్రాణం తీసిందని వెల్లడించిన సీనియర్ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ దీపక్ మాథుర్, ధ్రువ్ కు తలలోకి బులెట్ దిగిందని, క్రిటికల్ లైఫ్ సపోర్టు సిస్టమ్ పై ఉంచామని తెలిపారు.

ఆ తరువాత తాను కాల్పులు జరిపినట్టు కిషన్ కు ఫోన్ చేసి తెలిపిన మహిపాల్, ఫరీదాబాద్ పారిపోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి కుటుంబ సభ్యులపై మహిపాల్ ఎందుకు కాల్పులకు తెగబడ్డాడన్న విషయాన్ని విచారిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -