Wednesday, April 24, 2024
- Advertisement -

రష్యాకు వ్యతిరేకంగా భారత్.. అసలెందుకు ?

- Advertisement -

ప్రపంచ దేశాలన్నిటిలో భారత్ రష్యా మద్య స్నేహ బంధం చాలా ప్రత్యేకమైనది. ఈ రెండు దేశాలు ఎన్నో ఏళ్లుగా స్నేహ బంధన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. కేవలం ఎగుమతులు దిగుమతుల విషయంలోనే కాకుండా రక్షణ పరంగా కూడా ఇరు దేశాలు ఒకదానికొకటి అండగా నిలుస్తూ వస్తున్నాయి. అయితే రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైన తరువాత ఊహించని పరిణామాలు చాలానే చోటు చేసుకున్నాయి. ముక్యంగా నాటో సభ్యత్వ దేశాలన్నీ కూడా రష్యాపై ఆంక్షలు విధిస్తూ.. వ్యతిరేకంగా నిలుస్తూ వచ్చాయి. ముఖ్యంగా ఈ వ్యతిరేకత అంత కూడా అమెరికా కేంద్రంగా జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

దాంతో రష్యాకు వ్యతిరేకంగా నిలవాలని భారత్ పై పలుమార్లు అమెరికా ఒత్తిడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అమెరికా భారత్ కు మద్య కూడా మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో భారత్.. రష్యా ఉక్రెయిన్ వార్ లో ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా తటస్థ వైఖరి ప్రదర్శిస్తూ వచ్చింది. అయితే తాజాగా వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో ఎవరు ఊహించని విధంగా భారత్ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. దీంతో ఇన్నాళ్ళు మిత్రా దేశాలుగా ఉన్న భారత్ రష్యాల మద్య దూరం పెరుగుతోందా ? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి . ఎందుకటే గతంలో జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రత మండలి చర్చల్లోనూ, ఓటింగ్ ల్లోనూ భారత్ తటస్థ వైఖరి అవలంభించింది.

కానీ ఇప్పుడేందుకు భారత్ రష్యాకు వ్యతిరేకంగా నిలుస్తోంది అన్న ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. ఉక్రెయిన్ 31వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా యుద్ద పరిస్థితులను ఐక్యరాజ్యసమితి భద్రత మండలి సమావేశం అయింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్ స్కీ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ప్ర్సంగించడాన్ని రష్యా వ్యతిరేకించింది. అంతే కాకుండా అతని ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ ప్రొసీజరల్ ఓటింగ్ కోరింది. దీంతో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగిన 15 దేశాలలో 13 దేశాలు జెలెన్ స్కీ ప్రసంగించడానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఇందులో భారత్ కూడా ఒకటి. కేవలం రష్యా మాత్రమే ఈ ఓటింగ్ లో వ్యతిరేకంగా నిలువగా.. చైనా మాత్రం ఓటింగ్ లో పాల్గొనలేదు. ఏది ఏమైనప్పటికి మిత్రదేశం రష్యాకు భారత్ వ్యతిరేకంగా ఓటు వేయడం అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Also Read

చైనా “వరుణాస్త్రం” ఫలిస్తుందా ?

శ్రీలంక, చైనా విషయంలో.. భారత్ ఆందోళన ఎందుకు ?

మన దేశం చుట్టూ ఎందుకిలా జరుగుతోంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -