Saturday, May 18, 2024
- Advertisement -

కోర్టులో కోమటిరెడ్డి, సంపత్ లకు హైకోర్టు డివిజన్ బెంచ్ షాక్..

- Advertisement -

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ ల ఎమ్మెల్యేల పునరుద్దరణ కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రెండు మాసాల పాటు స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణా ప్ర‌భుత్వానికి ఊర‌ట ల‌భించింది.

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో, మండలి చైర్ పర్సన్ స్వామిగౌడ్ పై మైకులు విసిరి, ఆయన కంటికి గాయం కావడానికి కారణమయ్యారంటూ, కోమటిరెడ్డి, సంపత్ ల శాసన సభ సభ్యత్వాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

తమ సభ్యత్వాల పునరుద్దరణ విషయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్‌లు హైకోర్టు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు.ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దును కోర్టు తప్పు బట్టింది. తక్షణమే వీరద్దరూ కూడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రకటించింది. ఈ తీర్పును అమలు చేయలేదు. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ కూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్లను తోసిపుచ్చింది.

కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కరణ ఈ ఏడాది జూన్ 12వ తేదీన కేసులు దాఖలు చేశారు.ఈ కేసుపై ఆగష్టు 14వ, తేదీన హైకోర్టు సీరియస్ అయింది.కోర్టు ధిక్కరణ కేసుపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారికి కూడ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఈ విషయంలో వారిరువురూ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన సింగిల్ జడ్జ్, వారిపై అనర్హత వేటు కుదరదని తీర్పిచ్చారు. ఘటనకు సంబంధించి వీడియో సాక్ష్యాలను కోర్టుకు అందించడంలో అసెంబ్లీ అధికారులు విఫలం కావడంతో, వారు ఎమ్మెల్యేలుగా కొనసాగవచ్చని కోర్టు పేర్కొంది. ఇదే కేసులో అసెంబ్లీ స్పీకర్ కు నోటీసులు కూడా ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ని ఆశ్రయించగా, విచారించిన ధర్మాసనం, సింగిల్ బెంచ్ తీర్పును రెండు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -