Wednesday, May 15, 2024
- Advertisement -

ప్ర‌భుత్వం పై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం….

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి హైకోర్టులో మ‌రో సారి చుక్కెదురైంది. ఏపీలో టీడీపీ నేతలపై ఇష్టమొచ్చినట్టుగా కేసులు ఎత్తివేశారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆరోపించారు. 132 అక్రమ జీవోతో 278 మందిపై కేసులు ఎత్తివేస్తూ చంద్రబాబు జీవోలు జారీ చేశారని తెలిపారు. దీనిపై హ‌కోర్టు కెల్లారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే.

గ‌తంలో కేసుకుసంబంధించి పిటీష‌న్‌పై విచారించిన కోర్టు ప్ర‌భుత్వం స‌మాధానం ఇచ్చేందుకు రెండు వారాల గ‌డువిచ్చింది. అయితే ప్ర‌భుత్వం కోర్టు ఆదేశాల‌ను లేక్క‌చేయ‌కుండా జీవోపై వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. దీనిపై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కోర్టు ప్ర‌భుత్వానికి ఇచ్చిన గ‌డువు విష‌యాన్ని ఆళ్ల విచార‌ణ సంధ‌ర్భంగా ప్ర‌స్తావించారు.

దీనిపై స్పందించిన కోర్టు ప్ర‌భుత్వం అడిగిన‌ట్లే రెండు వారాలు గ‌డువిచ్చినా ఎందుకు స్పంధించ‌లేద‌ని న్యాయ‌మూర్తి ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. చివ‌ర‌కు ఎమ్మెల్యే పిటీష‌న్ పై స్పంధించేందుకు మూడు వారాలు గ‌డివిస్తున్న‌ట్లు కోర్టు ప్ర‌భుత్వానికి స్ప‌ష్టం చేసింది.

సీఎం చంద్రబాబు చట్టాలను లెక్కచేయడం లేదని, కోర్టులను గౌరవించడం లేదని విమర్శించారు ఆర్కే. హత్యలు, అత్యాచారాలు వంటి కేసుల్లో నిందితులపై కేసులు ఎత్తివేస్తే బాధిత కుటుంబాలు ఏమవ్వాలని ప్రశ్నించారు. అన్యాయానికి గురికాబడ్డ ప్రజానీకానికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కేసుల ఉపసంహరించినవారి జాబితాలో స్పీకర్‌, డిప్యూటీ సీఎం, ఎనిమిది మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప‌లువురు నేత‌లు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -