Friday, May 17, 2024
- Advertisement -

మ్యాజిక్ పిగ‌ర్‌ను సాధించ‌డంలో విఫ‌లం అయిన‌ కన్జర్వేటివ్ పార్టీ

- Advertisement -
Hung parliament confirmed General election polls 2017 in UK

బ్రిటన్ ఎన్నికల ఫలితాలు కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి, ఆ దేశ ప్రధానమంత్రి థెరిసా మేకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది.పార్లమెంట్‌లో తన బలాన్ని పెంచుకునే లక్ష్యంతో మూడేళ్ల ముందస్తుగా నిర్వహించిన ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థానాలను గెలుపొందడంలో విఫలమైంది.

అత్యధిక స్థానాల్లో గెలుపొందినప్పటికీ సాధారణ మెజారిటీని ఆ పార్టీ చేరుకోలేకపోయింది. మరోవైపు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ అనూహ్యంగా పుంజుకొంది.

మొత్తం 650 స్థానాల్లో ఇప్పటి వరకూ 643 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. కన్జర్వేటివ్‌ పార్టీ 313 స్థానాలను గెలుపొందగా.. లేబర్‌ పార్టీ 260 స్థానాల్లో విజయబావుటా ఎగరవేసింది. ఏ పార్టీకి సాధారణ మెజారిటీ(326) రాకపోవడంతో హంగ్‌ ప్రభుత్వం ఏర్పడనుంది. మరోవైపు ప్రజల మద్దతును కోల్పోయిన థెరిసా మే తన పదవికి రాజీనామా చేయాలని విపక్ష లేబర్‌ పార్టీ నేత జెరెమె కార్బిన్‌ డిమాండ్‌ చేశారు.

{loadmodule mod_custom,Side Ad 1}

రాజీనామా చేసే ఉద్దేశ్యమే లేదని థెరిసా పేర్కొన్నట్టు బీబీసీ రిపోర్టు చేసింది. ప్రస్తుత ప్రధాని థెరిసా మే నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ 315 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీని చేరుకోలేకపోయింది.

{loadmodule mod_custom,Side Ad 2}

Also read

  1. పాక్‌,చైనాల‌ను ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌న్న‌ఆర్మీచీఫ్‌ రావ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.
  2. సిరియా అంత‌ర్ యుద్ధంలో మ‌ర‌ణాన్ని జ‌యించిన బుడుత‌
  3. ప్ర‌పంచంలోనే అత్యంత అరుదైన దొంగ‌త‌నం ..ఆ దొంగ దోచుకున్న‌వి ఏంటో తెలుసా…?
  4. ఎదురుతిరిగి దాడి చేస్తే ఎలా ఉంటుందో పాక్‌కు రుచి చూపించింన భార‌త్‌ ఆర్మీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -