Sunday, May 19, 2024
- Advertisement -

ప్రేమికుల‌కు ఆడ్డాగా మారిన‌మెట్రో స్టేష‌న్ లిప్ట్‌లు..

- Advertisement -

న‌గ‌రంలో ప్రేమికులడ్డా అంటే ట‌క్కున గుర్త‌కొచ్చే ప్రాంతాలు నెక్లెస్ రోడ్డ‌, ఇందిరా పార్కులు గుర్తుకొస్తారు. ఇవి ప్రేమికుల‌కు అడ్డాగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు అక్క‌డ బోర్ కొట్టిందేమోగాని ప్రేమికులు కొత్త అడ్డాలు వెతుక్కుంటున్నారు. వాటిలో ఇప్పుడు మెట్రో స్టేష‌న్ చేరింది. ప్ర‌యాణీల‌కుల సౌక‌ర్యం కోసం నిర్మించిన మెట్రోస్టేష‌న్ లిప్ట్‌లు ప్ర‌మేమికుల‌కు అడ్డాగా మారాయి.

తాజాగా అలాంటి సంఘ‌ట‌నే చోటు చేసుకుంది. మెట్రో లిఫ్టుల్లో ఎవరూ లేని సమయంలో ప్రేమికులు ఆరాచాకాల‌కు అడ్డులేకుండా పోతోంది. అసాంఘిక కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్న‌ట్లు మెట్రో అధికారులు గుర్తించారు.
అనేక మెట్రో స్టేషన్లలోని లిఫ్టుల్లో ఇటీవల యువ జంటలు కామకలాపాలతో రెచ్చిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బయటకొచ్చిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

మెట్రో స్టేష‌న్‌లోని ప్ర‌తీ ప్రాంతం అత్యాధునికి కెమెరాల నిఘాలో ఉన్నాయి. ప్ర‌యాణికుల క‌ద‌లిక‌ల‌ను ఎప్ప‌టి క‌ప్పుడు ఉప్ప‌ల్‌లోని క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌నుంచి ప‌ర్య‌వేక్షిస్తుంటారు. ఇక అలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా మెట్రో అధికార‌లు చ‌ర్య‌లు తీసుకున్నారు. స్టేష‌న్‌లో ఏకాంతంగా ఉండే ప్రదేశాల్లో పద్ధతిగా ఉండాలంటూ సూచన బోర్డులు ఏర్పాటు చేశారు. వీడియోల విష‌యం మెట్రో ఉన్న‌తాధికారుల దృష్టికి వెల్ల‌డంతో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దీనిపై విచార‌ణ చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇక అలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృత‌మ‌యితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

ప్రైవసీ కోరుకుంటూ మెట్రో లిఫ్ట్‌ల్లో ప్రయాణించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ఈతరం ప్రేమికులు. ఒకరి ద్వారా మరొకరు… వారి ద్వారా ఇంకొకరు మెట్రో లిఫ్ట్‌ల్లో ఒక్కసారి ట్రై చేయమని రికమెండ్ కూడా చేస్తున్నారుట. ఇలా కొన్నిరోజులు పోతే మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల కంటే… లిఫ్ట్ ఎక్కడం కోసం వెయిట్ చేసే లవర్స్ సంఖ్య పెరుగుతుందని భయం పట్టుకుంది మెట్రో సిబ్బందికి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -