Monday, May 20, 2024
- Advertisement -

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మానంలో మ‌రో క‌లికితురాయి

- Advertisement -

అమ‌రావ‌తి ప్ర‌తిష్ట‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా పెంచె మ‌రో స‌రికొత్త ప్రాజెక్ట్ రాబోతోంది. నవ్యాంధ్ర రాజ‌ధాని ప్ర‌జ‌ల క‌ల నెర‌వేర‌బోతోంది. నిన్న‌టి వ‌ర‌కు మెట్రో రైలు ప్రాజెక్టు వ‌స్తుంద‌ని ప్రజ‌లు ఎంతో ఆశ‌తో ఎదురు చేశారు.కాని అది నెర‌వేర‌లేదు.ఆంధ్రుల రాజధాని అమరావతి ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటి జాబితాలోచేర్చేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ఇది దోహాదం చేయ‌నుంది.
అమరావతినుంచి తిరుపతికి 25 నిమిషాల్లో, విశాఖకు 23నిమిషాల్లో ప్రయాణికులను చేర్చే రవాణా వ్యవస్థను రాజధానికి తీసుకురావాలనుకుంటున్నారు. ఆప్రాజెక్టు సాకార‌మైతె మెట్రో దానిముందు దిగ‌దుడుపే.మెట్రో రైలును మించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యంత వేగంతో కూడిన రవాణా వ్యవస్థను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేలా అధ్యయనం జరపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు.
ప్రపంచంలో ఇంతవరకు ఈ రకం రైలు ఇంకా చుక్ చుక్ అనలేదెక్కడా. అయితే, చంద్రబాబు నాయుడు అమరావతి అంతర్జాతీయ రంగులద్దేందుకు గ్లోబల్ కంపెనీలకు పూలబాట వేస్తున్నందున తానొక రాయి వేద్దామని హైపర్ లూప్ వన్ అనే సంస్థ భావిస్తున్నది.హైపర్‌లూప్ వ్యవస్థ విశేషాలను బుధవారం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రికి ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.
హైపర్‌లూప్ రైలు వస్తే అమరావతి నుంచి హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నయ్‌కు కూడా విమానం కన్నా వేగంగా రైల్లోనే తొందరగా చేరుకోవచ్చు. హైపర్ లూప్ రవాణా వ్యవస్థ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు సిద్ధంగా వున్నామని, పరిశోధనా కేంద్రాన్ని కూడా అమరావతిలో ఏర్పాటు చేస్తామని హైపర్ లూప్ వన్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.ఇది సాకార‌మైతె ప్ర‌పంచంలో హైప‌ర్‌లూప్ రైల్లో ప్ర‌యానించేది మ‌న‌మే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -