Wednesday, May 15, 2024
- Advertisement -

భారత విమానం హైజాక్‌కు ముస్క‌రుల భారీ కుట్ర‌ ..

- Advertisement -

కశ్మీర్‌లో పట్టుబడిన తమ అనుచరులను విడిపించుకోడానికి ఉగ్రవాదులు పెద్ద పథకమే వేసినట్టు నిఘా వర్గాలు హెచ్చిరించాయి. దీనికోసం కాబూల్ కేంద్రంగా భారత విమానం హైజాక్‌కు ముష్కరులు కుట్ర పన్నారు. ఆయుధాలతో విమానంలోకి ప్రవేశించి ఇండియన్ ఫ్లైట్‌ను హైజాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కాశ్మీర్ లో పట్టుబడిు ఉగ్రవాదులను విడిపించుకునేందుకు లష్కరే తోయిబా ఉగ్రవాదులు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. కాబూల్ కేంద్రంగా విమానం హైజాక్ కు కుట్ర పన్ని, భారత విమానాన్ని దారి మళ్లించేందుకు వ్యూహాలు పన్నగా, ఆ విషయం నిఘా వర్గాలకు తెలిసింది. దీంతో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు, ఎన్ఎస్జీ బృందాలను రంగంలోకి దిగారు.

అప్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ నుండి బయల్దేరే ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేస్తారు. ఆ ఫ్లైట్‌ను ఇండియాలో ఏదో ఒక ఎయిర్ పోర్టులో దించుతారు. తర్వాత అధికారులతో బేరసారాలు సాగించి కశ్మీరు పోలీసులు అరెస్ట్ చేసిన ఉగ్రవాదుల్ని వదిలేయాలంటూ కండిషన్ పెడతారు. ఆ విధంగా టెర్రరిస్టుల్ని విడిపించుకొని వెళ్లేందుకు లష్కరే తోయిబా కుట్ర.

కశ్మీరు లోయలో ఎల్‌ఈటీతోపాటు హిజ్‌బుల్‌ ముజాహిద్దీన్‌, జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థలు ఉద్ధృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలకు చెందిన అనేక మందిని ఇటీవల భద్రత బలగాలు పట్టుకున్నాయి. ఇలా పట్టుబడిన వారిలో ముఖ్య నేతలను విడిపించుకునేందుకు ముష్కరులు కుట్ర పన్నారని, అందులో భాగంగానే కాబూల్‌ నుంచి బయలుదేరే విమానాన్ని హైజాక్‌ చేసేందుకు వ్యూహం రచిస్తున్నారని ఐబీ గుర్తించింది.

హైదరాబాద్ సహా దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ప్రస్తుతం రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ముందుగానే నిఘా వర్గాలకు సమాచారం అందడంతో, భద్రతను కట్టుదిట్టం చేసిన సీఐఎస్ఎఫ్, క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరమే ప్రయాణికులను విమానాశ్రయం లోపలికి పంపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -